టి.నరసాపురం:ఎంపిడిఒ కార్యాలయ ఎఒ పావులూరు శ్రీనివాసరావు మంగళవారం తెల్లవారుజామున కామవరపుకోటలోని తన నివాసంలో గుండెపోటుతో మృతి చెందారు. గతంలో ఇన్‌ఛార్జి ఎంపిడిఒగా, సూపరింటెండెంట్‌గానూ బాధ్యతలు నిర్వహించారు. శ్రీనివాసరావు మృతికి ఎంపిడిఒ ఎన్.తిరుపతి స్వామి, కార్యాలయ సిబ్బంది సంతాపం తెలిపారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢసానుభూతి వ్యక్తం చేశారు.










