Jun 21,2023 19:27

నారాయణను సన్మానిస్తున్న అధికారులు

ప్రజాశక్తి - చిప్పగిరి
చిప్పగిరి మండల పరిషత్‌ ఉపాధి హామీ భవనంలో మార్కెట్‌ యార్డు ఛైర్మన్‌ గుమ్మనూరు నారాయణను తహశీల్దార్‌ లక్ష్మీనారాయణ, ఎపిఒ మాధవ శంకర్‌ శాలువా, పూలమాలతో బుధవారం సన్మానించారు. ఈ సందర్భంగా తహశీల్దార్‌ లక్ష్మీనారాయణ, ఎపిఒ మాధవ శంకర్‌ మాట్లాడారు. మండలంలోని గుమ్మనూరు గ్రామం నుంచి మార్కెట్‌ యార్డు ఛైర్మన్‌ పదవి లభించడం సంతోషకరమని తెలిపారు. మార్కెట్‌ యార్డు ఛైర్మన్‌ గుమ్మనూరు నారాయణ ఉద్యోగ సంఘాలకు, ప్రభుత్వ ఉద్యోగులకు అండగా ఉండాలని కోరారు. అనంతరం నారాయణ మాట్లాడారు. తాను ఎల్లప్పుడూ అధికారుల పక్షపాతినే అని తెలిపారు. మంత్రి జయరామ్‌ సహకారంతో అన్ని శాఖల అధికారులను కలుపుకొని అభివృద్ధికి కృషి చేస్తానన్నారు. వైసిపి ఆలూరు తాలూకా బూత్‌ కమిటీ సభ్యులు ఏరూరు రాజన్న, దౌల్తాపురం షేకన్న, సతీష్‌, సూరి పాల్గొన్నారు.