గుక్కెడు నీళ్లు అందించండి..!
ప్రజాశక్తి-వెంకటగిరి: వెంకటగిరి మున్సిపాల్టీ పరిధి లోని 25వవార్డులోని కాంపాళెం దళిత వాడలో మున్సిపాలిటి అధికారులు నీళ్లు వదడం లేదని 'మాకు నీళ్లు అందించండి...' అంటూ మహిళలలు ఆవేదన వ్యక్తం చేశారు. శనివారం గత కొన్ని నెలలుగా తమకు మున్సిపాల్టీ అధికారులు నీళ్లు వదలడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. నీళ్లు ఎందుకు వదలడం లేదని అధికారులను నిల దీయగా మున్సిపాలిటి అనుమతులు తీసుకోలేదని కుళాయి పన్ను కట్టాలని కట్టే వరకు నీళ్లు వదిలేది లేదని అధికారులు తేల్చిచెబుతున్నారన్నారు. తమ వద్ద మున్సిపాలిటి సిబ్బంది మనిషికి 2వేల రూపాయిలు తీసుకొని ఇంటింటికి కుళాయి కనెక్షన్ ఇచ్చారన్నారు. తమకు అనుమతులపై అవగా హన లేక పోవడంతో దళా రులు నగదు తీసు కొని దొంగ కనెక్షన్ ఇచ్చారన్నారు. నెలలు గడస్తున్నా మంచినీళ్లు వదలడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల సమయంలో పడి గాపు లు కాసి ఓట్లు వేయించు కుంటారని ఈ సారి తమకు మున్సిపల్ నీటిని అందించే వరకు నాయకులెవరినీ రానివ్వబోమని మహిళలు చెప్పారు.










