Sep 04,2023 19:14

ధర్నా చేస్తున్న దృశ్యం

ప్రజాశక్తి -గుడ్లూరు :పెంచిన కరెంట్‌ చార్జీలు తగ్గించాలని, నిత్యావసర వస్తువుల ధరలు తగ్గించాలని, యువతకు ఉద్యోగాలు కల్పించాలని కోరుతూ గుడ్లూరు తహశీల్దార్‌ కార్యాలయం వద్ద సిపిఎం, సిఐటియు ఆటో యూనియన్‌ అధ్వర్యంలో భారీ ర్యాలీ, ధర్నా చేపట్టారు. సిపిఎం మండల కన్వీనర్‌ జి.వెంకటేశ్వర్లు మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, ధరలను అదుపు చేయడం లో ప్రజా సమస్యలను పరిష్కారం చేయడంలో విఫలం చెందారని దుయ్య బట్టారు. స్థానికంగా 13రకాల డిమాండ్స్‌ తో కూడిన వినతి పత్రాన్ని, తహశీల్దార్‌, మండల అభివద్ధి అధికారి, ఎలక్ట్రికల్‌ ఇంజనీరింగ్‌, మండల విద్యాశాఖ అధికారులకు వినతి పత్రాలు సమర్పించారు. సీపీఎం కార్యదర్శి కొట్టే వెంకయ్య, దా మా కష్ణయ్య పి. నాగేశ్వరరావు, కోమరగిరి అంజయ్య, ఆర్‌. మాల్యాద్రి, సిఐటియు నాయకులు, టీ. ఓంకార్‌, జి.రాజేష్‌ , మన్నెం సుబ్రమణ్యం, నారాయణ, జార్జీ, దినయ్య, కోటేశ్వరరావు, గిరిజనులు, వెంకయ్య కోటమ్మ, ఆదెమ్మ ఉన్నారు.