గట్కా ఛాంపియన్‌షిప్ పోటీల్లో రేణిగుంట విద్యార్థుల ప్రతిభ
ప్రజాశక్తి -రేణిగుంట: ఈనెల 16 17 తేదీల్లో ఆంధ్రప్రదేశ్ గట్కా అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో కాకినాడలోని బాలురు బాలికలకు 2023సంవత్సరం పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో రేణిగుంట జిల్లా పరిషత్ బాలికోన్నత పాఠశాల విద్యార్థులు ఏడుగురు పాల్గొని బంగారు పతకాలు, నాలుగు రజిత పతకాలు, రెండు కాంస్య పతకాలు కైవసం చేసుకున్నారు. ఇందులో ఈ సౌమ్య, ఎం సంజన, ఎస్ స్వాతి, కె భారతి బంగారు పతకాలు సాధించారు. ఎం సుచిత్ర రజిత పతకం, ఉమామహేశ్వరి, మనీ మేఘన కాంస్య పతాకాలు సాధించారు. ఈ గట్కా పోటీల్లో గెలుపొందిన బాలికలు ఢిల్లీలో అక్టోబర్‌లో జరిగే జాతీయ పోటీలలో పాల్గొంటారని పాఠశాల ప్రధానోపా ధ్యాయులు విష్ణువర్ధనం , గట్కా ఏపీ అసోసియేషన్ ప్రసిడెంట్ రేఖా రాణి మంగళవారం తెలిపారు. పతకాలు సాధించిన విద్యార్థులకు పాఠశాల ఉపాధ్యాయుల బందం తోటి విద్యార్థులు, తల్లిదండ్రులు, పూర్వపు విద్యార్థుల సంఘం నాj ుకులు అభినందనలు తెలిపారు.










