Oct 01,2023 16:36

సమావేశంలో మాట్లాడుతున్న హౌసింగ్ కార్పొరేషన్ డైరెక్టర్ రమాదేవి

గత ప్రభుత్వంలో నిర్మించుకున్న ఇండ్లకు
బిల్లులు మంజూరు చేయాలి
- హౌసింగ్‌ కార్పొరేషన్‌ డైరెక్టర్‌ రమాదేవి
ప్రజాశక్తి - పగిడ్యాల

     గత టిడిపి ప్రభుత్వంలో నిర్మించుకున్న పేదల ఇండ్లకు బిల్లులు మంజూరు చేయాలని రాష్ట్ర హౌసింగ్‌ కార్పొరేషన్‌ డైరెక్టర్‌ గంగిరెడ్డి గారి రమాదేవి కార్పొరేషన్‌ అధికారులను కోరారు. ఆదివారం విజయవాడలోని హౌసింగ్‌ కార్పొరేషన్‌ భవనంలో జరిగిన సమావేశంలో రమాదేవి మాట్లాడారు. గత టిడిపి ప్రభుత్వంలో ఎంతో మంది నిరుపేదలు ఇండ్లు నిర్మించుకొని బిల్లులు రాక అప్పులు చేసుకున్నారని తెలిపారు. వారికి రాజకీయపార్టీలకతీతంగా బిల్లులు మంజూరు చేయాలని అధికారులను కోరారు. జగనన్న ప్రభుత్వంలో అర్హులైన వారందరికీ ఇండ్ల పట్టాలు మంజూరు చేశామని, ఇంకా ఎంతోమంది ఇండ్లు లేని నిరుపేదలు ఉన్నారని చెప్పారు. వారికి ఇండ్ల పట్టాలు మంజూరయ్యేలా చర్యలు చేపట్టాలని అధికారుల దృష్టికి ఆమె తీసుకెళ్లారు. జగనన్నకు చెబుదాం కార్యక్రమంలో, గత ప్రభుత్వంలో నిర్మించుకున్న ఇండ్లకు బిల్లులు మంజూరు కానీ లబ్ధిదారుల పేర్ల నివేదిక తయారు చేసి ఇవ్వాలని, తక్షణమే వాటిని పరిష్కరిస్తామని అధికారులు హామీ ఇచ్చారని ఆమె తెలిపారు.