ప్రజాశక్తి-తోటపల్లిగూడూరు :టిడిపి దొంగ ఓట్ల విషయంలో అప్రమత్తంగా వుండాలని జిల్లా వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ గ్రీవెన్ సెల్ అధ్యక్షుడు, జగనన్న సచివాలయ కమిటీ కన్వీనర్ తలమంచి సురేంద్రబాబు సూచించారు. శనివారం అయన తోటపల్లిగూడూరు మండలం లోని వరిగొండ బిట్-1, బిట్-2 తోటపల్లిగూడూరు, తోటపల్లి సచివాలయాల్లో వైసీపీ నాయకులు, కన్వీనర్లు, వాలంటీర్ల, గ్రుహ సారధులతో ప్రత్యేక సమావేశాలు నిర్వహించారు. ఈ సందర్బంగా సురేంద్ర బాబు మాట్లాడుతూ దొంగ ఓట్లపై అప్రమత్తంగా ఉండాలని మాజీ ఎమ్మెల్సీ, టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ద్వారపురెడ్డి జగదీష్ పార్టీ నాయకులు, కార్యకర్తలకు సూచించారు. పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో క్లస్టర్, బూత్‌లెవెల్ ఇన్‌చార్జిలతో గురువారం ప్రత్యేక సమావేశం నిర్వహించారు. వచ్చే ఎన్నికల్లో కూడా టీడీపీకి ఓటమి తప్పదన్నారు. దీన్ని దష్టిలో ఉంచుకొని దొంగ ఓట్లతో గెలవాలని తెలుగుదేశం పార్టీ కుట్రలు చేస్తోందని సురేంద్ర బాబు తెలిపారు. అందుకోసం అనర్హులను కూడా ఓటర్లుగా చేర్పించేందు కోసం శతవిధాలుగా ప్రయత్నాలు చేస్తోందని అయన ఆరోపించారు. ఈ దొంగ ఓట్ల విషయంలో వైవీపీ శ్రేణులు అప్రమత్తంగా ఉండాలని సురేంద్ర బాబు సూచించారు. దొంగ ఓట్లను గుర్తించి అధికారుల దష్టికి తీసుకెళ్లి తొలగించేందుకు చర్యలు చేపట్టాలని అయన సూచించారు. టీడీపీ ఎన్ని కుట్రలు చేసినా, కుతంత్రాలు పన్నినా రానున్న ఎన్నికల్లో వైసీపీ విజయం తథ్యమని సురేంద్ర బాబు తెలిపారు. కన్వీనర్లు, వాలంటీర్లు, గ్రుహ సారదులు ఇంటింటికీ తిరిగి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివద్ధి పనుల గురించి ప్రజలకు వివరించాలన్నారు. అదేవిదంగా సర్వేపల్లి నియోజకవర్గంలో రాష్ట్ర వ్యవసాయ శాఖామంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి చేపట్టిన అభివద్ధి, అందిస్తున్న పధకాలు అర్హులందరికీ చేరుతున్నాయో లేదో వాకబు చేయాలని, అందకపోతే రాజకీయాలను పక్కన బెట్టి అర్హులకు చేరేలా చర్యలు తీసుకోవాలన్నారు. వచ్చే ఎన్నికల్లో ప్రజలు వైసీపీకి, మరి ముఖ్యంగా గోవర్ధన్ రెడ్డికి బ్రహ్మరథం పట్టో విధంగా కషి చేయాలని సురేంద్ర బాబు సూచించారు. వైసీపీ నాయకులు, మాజీ సర్పంచ్ ఈదూరు రామాచార్యులు, కార్యకర్తలు పాల్గొన్నారు.










