May 19,2023 00:17

మాట్లాడుతున్న తహశీల్దార్‌ జానకమ్మ

ప్రజాశక్తి -కోటవురట్ల:ప్రభుత్వం పేదలకు నిర్మిస్తున్న జగనన్న గృహాలు వేగవంతానికి రెవెన్యూ సిబ్బ కృషిి చేయాలని తహసిల్దార్‌ జానకమ్మ తెలిపారు. గురువారం రెవెన్యూ సిబ్బందితో సమావేశం ఏర్పాటు చేశారు. ఇప్పటికే గ్రామాల్లో కేటాయించిన లేఅవుట్లలో నిర్మాణాలు సహా సొంత స్థలాల్లో నిర్మించుకునే వారికి ల్యాండ్‌ పొజిషన్‌ సర్టిఫికెట్లు అర్హత కలిగిన వారందరికీ అందజేయాలని సూచించారు. గ్రామాలలో అనధీనం భూముల వివరాలు సమగ్రంగా సేకరించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్‌ ఉర్దవరావు, కార్యాలయ సిబ్బంది, గ్రామ రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు.