Oct 21,2022 23:14

పరిశీలిస్తున్న వర్క్‌ ఇన్‌స్పెక్టర్‌

ప్రజాశక్తి-హుకుంపేట: గృహ నిర్మాణాలు లబ్ధిదారులు త్వరగా చేపట్టాలని మండల వర్క్‌ ఇన్స్పెక్టర్‌ గౌరీ శంకర్‌ సూచించారు. మండలంలోని కొట్నపల్లి, సంతారీ పంచాయతీ లో పర్యటించి, నిర్మాణాలు పరిశీలించారు. ఈ సందర్భంగా మండల వర్క్‌ఇన్స్పెక్టర్‌ గౌరీ శంకర్‌ మాట్లాడుతూ, పియమ్‌ఎవై, వై.యస్‌.ఆర్‌. గ్రామీణ పథకం కింద 2021-22లో హుకుంపేట మండలంలో 523 ఇల్లు మంజూరు అయ్యాయన్నారు. మెటీరియల్‌ సిద్ధం చేసి పునాదులు తీసిన లబ్ధిదారులకు తక్షణమే రూ.5000లు లబ్ధిదారుల ఖాతాలో జమ చేస్తామన్నారు. ఇళ్ల నిర్మాణం ప్రారంభించిన లబ్ధిదారులకు రెండు, మూడు రోజుల్లో వారి ఖాతాలో జమ చేయడం జరుగుతుందని, మంజూరైన లబ్ధిదారులు వెంటనే పునాదులు చేపట్టి త్వరగా నిర్మాణాలు చేసుకోవాలని ఆయన కోరారు.