Feb 10,2023 23:30

లబ్ధిదారులతో మాట్లాడుతున్న ఎంపీడీవో



ప్రజాశక్తి-నక్కపల్లి: గృహ నిర్మాణాలు వెంటనే పూర్తి చేయాలని ఎంపీడీవో సీతారామరాజు తెలిపారు. మండలంలోని ఉపమాక గ్రామంలో శుక్రవారం జగనన్న లేఅవుట్‌ ను హౌసింగ్‌ ఏఈ రాజుతో కలిసి సందర్శించారు. నిర్మాణ దశలో ఉన్న గృహాలను పరిశీలించి, లబ్ధిదారులతో మాట్లాడారు. అధికారుల ఆదేశాల మేరకు త్వరితగతిన గృహ నిర్మాణ పనులను పూర్తి చేయాలని సూచించారు. ఇంకా గృహ నిర్మాణ పనులను ప్రారంభించని లబ్ధిదారులు వెంటనే చేపట్టాలన్నారు. పేమెంట్లకు సంబంధించి ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చూస్తామన్నారు. ఈ కార్యక్రమంలో వర్క్‌ఇన్స్పెక్టర్‌, ఇంజనీరింగ్‌ అసిస్టెంట్‌ పాల్గొన్నారు.