Nov 26,2022 23:51

రికార్డులు పరిశీలిస్తున్న ఆర్‌డిఒ

ప్రజాశక్తి-నర్సీపట్నంటౌన్‌:మండలంలోని గబ్బాడ, నీలంపేట గ్రామాల్లో స్థానిక ఆర్‌డిఒ జయరాం పర్యటించారు. ఈ సందర్భంగా ప్రజలందరికీ నవరత్నాలు, జగనన్న కాలనీ పనులపై ఆరా తీశారు. ఇల్లు నిర్మించుకునే విధంగా లబ్ధిదారులను చైతన్యపరిచి నిర్మాణాలను వేగవంతం చేయాలని ఆయన ఆదేశించారు. నవరత్నాలు, జగనన్న కాలనీల్లో ఇళ్ల నిర్మాణాల పురోగతిపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్‌డిఒ మాట్లాడుతూ, ప్రభుత్వం అందించిన స్థలాల్లో త్వరితగతిన నిర్మాణం పూర్తి చేయాలని అధికారులను సూచించారు. లేవుట్‌లో ఎంతమందికి ఇంటి పట్టాల వివరాలపై నివేదిక అందజేయాలని ఆదేశించారు. ఇళ్ల నిర్మాణానికి అవసరమైన ఇసుక, స్టీల్‌, సిమెంట్‌లను సరఫరా చేసేలా చూడాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో తహశీల్దార్‌ రమణ, హౌసింగ్‌ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.