Feb 04,2023 00:30

మాట్లాడుతున్న ప్రత్యేక అధికారి ఉదయశ్రీ

ప్రజాశక్తి-కోటవురట్ల:మండలంలో చేపడుతున్న జగనన్న గృహ నిర్మాణాలు వేగవంతంగా పూర్తి చేయాలని మండల ప్రత్యేక అధికారి ఉదయశ్రీ సూచించారు. శుక్రవారం గృహ నిర్మాణ శాఖ అధికారులతో సమావేశం నిర్వహించారు. మండల వ్యాప్తంగా జరుగుతున్న పనులపై ఆరా తీశారు. నిర్మాణదారులకు బిల్లులు సకాలంలో చెల్లించడంతో పాటు సామాగ్రిని అందజేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో చంద్రశేఖర్‌, హౌసింగ్‌ ఇంజనీరు జగదీశ్వర్‌రావు, సచివాలయ ఇంజనీర్లు పాల్గొన్నారు.