గృహ విజ్ఞాన శాస్త్రంలో డి.మౌనికకు డాక్టరేట్
ప్రజాశక్తి - క్యాంపస్ : తిరుపతిలోని శ్రీ పద్మావతి మహిళా విశ్వ విద్యాలయంలోని గృహ విజ్ఞాన శాస్త్ర పరిశోధక విద్యార్థి దక్షిణపు మౌనికకు విశ్వవిద్యాలయం డాక్టరేట్ ప్రదానం చేసింది.గృహ విజ్ఞాన శాస్త్ర సహాయ అచార్యులు డాక్టర్ జి శిరీష పర్యవేక్షణలో 'మిల్లెట్స్ యాంటీ న్యూట్రియంట్స్ అండ్ దెయిర్ థెరపుటిక్ ఎఫెక్ట్ ఆన్ మెటబాలిక్ సిండ్రోమ్' అనే అంశంపై పరిశోధన గ్రంథం సమర్పించినందుకు డి.మౌనికకు విశ్వవిద్యాలయ పరీక్షల విభాగం డాక్టరేట్‌ను ప్రదానం చేస్తూ నోటిఫికేషన్ విడుదల చేశారు. ప్రస్తుతం సమాజంలో ఓ ప్రధాన ఆరోగ్య సమస్యగా ఉన్న మెటబాలిక్ సిండ్రోమ్ నియంత్రణ కు చిరుధాన్యలను వినియోగించడం, చిరుధాన్యాలను ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల మెటబాలిక్ సిండ్రోమ్ వ్యాధులను అధిగమించవచ్చని పరిశోధనల్లో శాస్త్రీయంగా గుర్తించారు. ఈమె పలు జాతీయ, అంతర్జాతీయ పరిశోధనా జర్నల్స్ లలో అనేక పరిశోధనా పత్రాలను ప్రచురించినట్లు వెల్లడించారు. మౌనికకు డాక్టరేట్ రావడం పట్ల పలువురు ఆచార్యులు, పరిశోధకులు, కుటుంబ సభ్యులు అభినందనలు తెలిపారు.










