Nov 01,2023 00:07

గృహ రుణాలకు రూ.150 కోట్లు కేటాయింపు

గృహ రుణాలకు రూ.150 కోట్లు కేటాయింపు
ప్రజాశక్తి -తిరుపతి సిటీ: ప్రముఖ ప్రైవేట్‌ ఫైనాన్స్‌ కంపెనీ వద్ధి హోం ఫైనాన్స్‌ చిన్న తరహా గృహ నిర్మా ణాల కోసం 150 కోట్ల రుణాలను అందించనున్నట్లు ఆ సంస్థ వ్యవస్థాపకులు, ఎండి సుంకు రాం నరేష్‌ తెలిపారు. తిరుపతిలోని విలేకరులతో మాట్లా డుతూ బిఎఫ్‌ఎస్‌ఐ, ఎఫ్‌ఎంసిజి రంగాలలో 25 ఏళ్లకు పైగా విశేష అనుభవం కలిగిన బెంగళూరు కేంద్రంగా వద్ధి హోమ్‌ ఫైనాన్స్‌ను 2022లో ప్రారంభించామన్నారు. చిన్న తరహా గహ రుణాలను అందించేందుకు, వ్యాపారాన్ని మరింతగా పెంచుకునేందుకు సిరీస్‌ ఏలో భాగంగా ఎలివేషన్‌ క్యాపిటల్‌ నుండి రూ.150 కోట్లను సమీకరించినట్లు తెలిపారు. ఈ సేకరించిన నిధులతో వ్యాపారాన్ని మరిన్ని ప్రాంతాలకు విస్తరించడం, సాంకేతికతను బలోపేతం చేయడం, రాబోయే బ్రాంచ్‌ల్లో మౌలిక వసతులు, ఉద్యోగ కల్పన కోసం ఉపయోగిస్తారు. ప్రస్తుతం ఆంధ్ర ప్రదేశ్‌ లోని తిరుపతి, కర్నూలు, నెల్లూరు, హిందూపురం, మదన పల్లె, అనంతపురం, ధర్మవరం, కర్నాటకలోని బెంగళూరు, హౌసకోట్‌, నేలమంగళ, చందాపుర, కెంగేరి, బంగారుపేట, చిక్క బల్లాపుర, మైసూర్‌, మద్దూర్‌, తుమకూరు, బీదర్‌, హుబ్లీ, బెలగావి, గుల్బర్గా పట్టణాల్లో ఇరవై శాఖలను వద్ధి హోమ్‌ ఫైనాన్స్‌ కంపెనీ ప్రారంభించిందన్నారు. 'ఏడాది లోనే వందలాది మంది వినియోగదారులకు సగటున రూ. 8-10 లక్షల పరిమాణంతో గహ రుణాలను పొందడంలో సహాయం చేసిందనితెలిపారు. చిన్న పట్టణాలు, గ్రామీణ ప్రాంతాలలో చిన్న తరహా వేతన దారులకు, స్వయం ఉపాధిదారులకు రుణాలు పొందడం కష్టాంగా ఉంటుంది, వారి సొంతింటి కళను నిజం చేయటానికి వద్ధి కట్టుబడి ఉంద న్నారు. ఈ అవకాశాన్ని ప్రజలు వినియోగించుకోవాలని కోరారు. ఈ సమావేశంలో మిధుల్‌ ఆరోరా, సందీప్‌ అరోరా, సునీల్‌ మొహత పాల్గొన్నారు.