Aug 07,2023 21:05

సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌ నిశాంత్‌కుమార్‌

పార్వతీపురం: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని పేదలకు నిర్మిస్తున్న ఇళ్లను లక్ష్యం మేరకు పూర్తి చేసి గృహ ప్రవేశాలకు సిద్ధం చేయాలని కలెక్టర్‌ నిశాంత్‌ కుమార్‌ అధికారు లను ఆదేశించారు. జిల్లా కలెక్టర్‌ కార్యాలయం నుంచి మండల స్థాయి అధికారులతో అభివృద్ధి పనుల పురోగతిపై వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్షా సమావేశాన్ని సోమవారం నిర్వహిం చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి ఈనెల 21 తర్వాత 5 లక్షలకు గృహ ప్రవేశాలు చేపట్టనున్నారన్నారు. అందులో భాగంగా జిల్లాలోని మక్కువ గహ నిర్మాణ కాలనీలో జిల్లా స్థాయి గృహ ప్రవేశాలు నిర్వహించనున్నందున పనులను త్వరితగతిన పూర్తి చేసి సిద్ధం చేయాలన్నారు. కాలనీలో మంచినీటి వసతి, విద్యుత్‌ , అవసరమైన మౌలిక వసతులు కల్పించాలని ఆదేశించారు. కాలనీలో సకల వసతులతో సుందరంగా తీర్చిదిద్దాలని అన్నారు. అర్బన్‌, గ్రామీణ ప్రాంతాల్లో పైకప్పు స్థాయిలో ఉన్న ఇళ్ల నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేసి లక్ష్యాలను సాధించాలన్నారు. ఈనెల 20లోగా లక్ష్యం ఏర్పాటు చేసుకొని ఇళ్లు పూర్తి చేయాలన్నారు. అవసరమైన వసతుల కల్పనకు తన దృష్టికి తీసుకువస్తే అనుమతులు మంజూరు చేస్తామని స్పష్టం చేశారు. జాయింట్‌ కలెక్టర్‌ ఆర్‌.గోవిందరావు, హౌసింగ్‌ పీడీ తమ్మినేని రమేష్‌, జిల్లా విద్యా శాఖ ఎడి ఈ.ఎమ్‌.రామ జ్యోతి, డ్వామా, డిఆర్‌డిఎ పీడీలు కె.రామ చంద్ర రావు, పి.కిరణ్‌ కుమార్‌, జిల్లా పంచాయితీ రాజ్‌ ఇంజనీరింగ్‌ అధికారి డా,ఎంవిజి కష్ణాజీ, ఆర్‌డబ్ల్యుఎస్‌ ఇంజినీరింగ్‌ అధికారి ఓ. ప్రభాకర రావు, డిఎంహెచ్‌ఒ బి.జగన్నాథ రావు, డిపిఒ బి.సత్యనారాయణ, జిల్లా సర్వే, సెటిల్‌ మెంట్‌ అధికారి కె.రాజ్‌కుమార్‌,ఇతర జిల్లా అధికారులు పాల్గొన్నారు