Jun 24,2023 21:13

గృహ నిర్మాణ శాఖ అధికారులతో మాట్లాడుతున్న శ్రీకాంత్‌రెడ్డి

రాయచోటి టౌన్‌ : పక్కా గహాల నిర్మాణాల పూర్తి కోసం స్పెషల్‌ డ్రైవ్‌ చేపట్టాలని హౌసింగ్‌ అధికారులకు ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌ రెడ్డి ఆదేశించారు. శనివారం శిబ్యాల గ్రామలో హౌసింగ్‌ పీడీ సాంబశివయ్య, డిఇ చంద్రశేఖర్‌, మండల ఎఇ తదితర అధికారులతో కలసి రాయచోటి నియోజక వర్గంలోని జగనన్న కాలనీలు, సొంత స్థలాలలో మంజూరైన పక్కా గహాల నిర్మాణాలపై మండలాల వారీగా సమీక్షించారు. ఇళ్ల నిర్మాణాలలో వేగం పెంచేలా విశేష కషి చేయాలన్నారు. పునాదులు కూడా ప్రారంభించని వాటిపై ప్రత్యేక దష్టి సారించి లబ్ది దారులను చైతన్యం చేయాలన్నారు. లబ్ధిదారులకు సకాలంలో బిల్లులు, మెటీరియల్స్‌ను అందజేయాలని ఆదేశించారు. బిల్లుల చెల్లింపులలో లంచాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
సబ్‌ స్టేషన్ల ఏర్పాటుకు కృషి
నియోజకవర్గంలో నాణ్యమైన విద్యుత్‌ను అందించేందుకు నూతన సబ్‌ స్టేషన్ల ఏర్పాటుకు కషి చేస్తున్నామని ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌ రెడ్డి అన్నారు. నూతన సబ్‌ స్టేషన్ల ఏర్పాటు స్థల సేకరణ తదితర అంశాలుపై శనివారం ఎపిఎస్‌పిడిసిఎల్‌ ఇఇ చంద్రశేఖర్‌రెడితో ఆయన చర్చించారు. గాలివీడు మండలంలోని చీమల చేరువుపల్లె, అరవీడు , గుండ్ల చెరువు, రాయచోటి టౌన్‌లో మాసాపేట, రింగ్‌ రోడ్డు గుణ్ణికుంట్ల రోడ్డు, సంబేపల్లె మండలం రౌతుకుంట, లక్కిరెడ్డిపల్లె మండలంలో దప్పేపల్లె, రాయచోటి రూరల్‌ లో యండపల్లెలలో నూతన సబ్‌ స్టేషన్ల ఏర్పాట్లపై చర్చించారు. ప్రమాదకరంగా ఉన్న విద్యుత్‌ స్తంభాల తొలగింపు, విద్యుత్‌ లైన్ల విస్తరణ తదితర అంశాలపై ఆరా తీశారు.