Nov 02,2022 22:32

మెప్మా పీడీ ఇమ్మానియేల్‌
ప్రజాశక్తి - జంగారెడ్డిగూడెం

             లబ్ధిదారులు గృహ నిర్మాణాలు సకాలంలో చేపట్టే విధంగా మెప్మా సిబ్బంది అవగాహన కల్పించాలని మెప్మా పీడీ బి.ఇమ్మానుయేల్‌ సూచించారు. స్థానిక మెప్మా కార్యాలయంలో సిబ్బంది ఆర్‌పిలతో బుధవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సిబ్బంది సంక్షేమానికి ఉన్నతాధికారులు చర్యలు తీసుకున్నారని తెలిపారు. మున్సిపాలిటీ పరిధిలో జరుగుతున్న గృహ నిర్మాణాలు, పథకాల అమలు తీరుపై చర్చించారు. మహిళా ఆరోగ్యంపై మెప్మా ప్రత్యేక దృష్టి సారించిందని వివరించారు. ఈ క్రమంలో మెప్మా సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో టిఎంసి మోహన్‌ , సిఒలు రాధ, వాసు పాల్గొన్నారు.