గృహ నిర్మాణాలు వేగవంతం చేయాలి
- డిఆర్‌డిఎ ప్రాజెక్టు డైరెక్టర్ వైబి.శ్రీధర్ రెడ్డి
ప్రజాశక్తి - ఆత్మకూరు
జగనన్న గృహ నిర్మాణాలను వేగవంతం చేయాలని డిఆర్‌డిఎ ప్రాజెక్ట్ డైరెక్టర్ వైబి.శ్రీధర్ రెడ్డి పేర్కొన్నారు. శనివారం మిడుతూరు మండలంలోని చింతలపల్లె సచివాలయ పరిధిలోని ఖాజీ పేట జగనన్న గృహ నిర్మాణాలను ఆయన పరిశీలించారు. అనంతరం నాడు-నేడు పథకం కింద చేపడుతున్న చింతలపల్లె ఎంపీపీ స్పెషల్ స్కూల్‌ను పరిశీలించి, తగు సూచనలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మండల అభివృద్ధి అధికారి జిఎన్. రెడ్డి, ఎపిఎం సుబ్బయ్య, హౌసింగ్ ఏఈ రమేష్, తదితరులు ఉన్నారు.
జగనన్న గృహ నిర్మాణాలను ఎస్‌ఇ పరిశీలన
చాగలమర్రి : మండలంలో జగనన్న లే అవుట్లలో పూర్తైన గృహ నిర్మాణాలను పంచాయతీ రాజ్ నంద్యాల జిల్లా ఎస్‌ఈ రామ్మోహన్ శనివారం పరిశీలించారు. మండలంలోని పెద్దబోధనం, మద్దూరు, తోడేంళ్లపల్లె, చాగలమర్రి గ్రామాల్లో నిర్మాణాలు పూర్తైన గృహాలను పరిశీలించారు. అనంతరం కాలనీలో విద్యుత్, నీటి సౌకర్యం ఉందా లేదా అని తనిఖీ చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ చాగలమర్రిలోని మూడు లేఅవుట్లలో 66, పెద్దబోధనం 21, మద్దూరు 6, తోడేంళ్లపల్లె 17గహాలు పూర్తయ్యాయని వివరించారు. అనంతరం చాగలమర్రిలోని కస్తూర్బా, ప్రధాన ప్రాథమిక పాఠశాల, తోడేంళ్లపల్లె పాఠశాలల్లో నాడు నేడు పనులు, మద్యాహ్నభోజన పథకాన్ని పరిశీలించారు. కార్యక్రమంలో డిఈ లక్ష్మి నరసింహులు, తహసీల్దారు విజరు కుమార్, ఎంపీడీవో భాగలక్ష్మి, ఈవోపీఆర్డీ నాగేంద్రయ్య, ఏఈలు షఫివుల్లా,కొండారెడ్డి, ఈవో సుదర్శన్రావు తదితరులు పాల్గొన్నారు.
గృహాలను పరిశీలిస్తున్న డిఆర్‌డిఎ ప్రాజెక్టు డైరెక్టర్ వైబి.శ్రీధర్ రెడ్డి










