గృహ నిర్మానాలు పరిశీలన
ప్రజాశక్తి ఆత్మకూరు అర్బన్ : మండలంలోని వాసిలి గ్రామంలో ''పెదలందరికీ ఇళ్ళు'' పథకం ద్వారా నిర్మాణంలో ఉన్న గృహాలను బుధవారం ఎంపిడిఒ, అసిస్టెంట్ ఇంజనీరు (హౌసింగ్) వారు పరిశీలించారు. ఎంపిడిఒ ఐజాక్‌ప్రవీణ్ మాట్లాడుతూ వాసిలి గ్రామంలో హౌసింగ్ లే అవుట్‌లో మొత్తం 19 గృహ నిర్మాణాలు వివిధ దశలలో వున్నాయని త్వరలోనే పూర్తి చేయిస్తామని తెలిపారు. మూడు ఇళ్లకు శ్లాబులు వేసే పనిని వారు పరిశీలించారు. అదే విధంగా మండలంలోని అన్నీ పంచాయతీల పరిధిలో 599 గృహాలు మంజూరై ఉన్నాయని, అందరూ లబ్ధిదారులు త్వరితగతిన నిర్మాణాలు పూర్తి చేసుకోవాలని సూచించారు. ఇంజనీరింగ్ అసిస్టెంట్స్ అందరూ లబ్ధిదారులను ప్రోత్సహించి త్వరగా ఇళ్లు పూర్తి చేసుకునే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. వీరివెంట కాంట్రాక్టర్ దశరాధారామిరెడ్డి, లబ్ధిదారులు పాల్గొన్నారు.










