May 07,2023 00:49

పరిశీలిస్తున్న అధికారులు

ప్రజాశక్తి-నక్కపల్లి :నక్కపల్లి లో జగనన్న లే అవుట్‌ లో హౌసింగ్‌ డే సందర్భంగా గృహ నిర్మాణ పనులను శనివారం ఎంపీడీవో సీతారామరాజు, అధికారులు పరిశీలించారు. గృహ నిర్మాణాలు వేగవంతంగా పూర్తి చేయాలని లబ్ధిదారులకు సూచించారు. ప్రారంభించిన గహాలకు సంబంధించి లబ్ధిదారులతో మాట్లాడారు. లబ్ధిదారులకు పేమెంట్‌ మంజూరు విషయంలో ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని హౌసింగ్‌ అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో హౌసింగ్‌ ఏఈ రాజు, ఎంఈఓ డివిడి ప్రసాద్‌ పాల్గొన్నారు.