Mar 01,2023 00:00
మాట్లాడుతున్న కమిషనర్‌ భాను ప్రతాప్‌

ప్రజాశక్తి-బాపట్ల: బాపట్లలో జగనన్న కాలనీ లో ప్రభుత్వం అందించిన జగనన్న కాలనీలో గహ నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేయాలని బాపట్ల మున్సిపల్‌ కమిషనర్‌ భాను ప్రతాప్‌ అధికారులను ఆదేశించారు. మంగళవారం మున్సిపల్‌ కౌన్సిల్‌ హాల్లో విఆర్‌వో, ఆర్‌పిల సమీక్ష సమావేశం నిర్వహించారు. వార్డు సచివాలయాల వారీగా గృహ నిర్మాణాలపై సమీక్ష నిర్వహించారు. పట్టణ పేదరిక నిర్మూలన శాఖ మెప్మా స్వయం సహాయక సంఘాల ద్వారా లబ్ధిదారులకు రుణాలు అందజేసి త్వరితగతిన గృహ నిర్మాణాలు పూర్తయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. గృహ నిర్మాణాలపై శ్రద్ధ కనబరచని వార్డు సచివాలయ సిబ్బందిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సమావేశంలో హౌసింగ్‌ డిఈ శ్రీనివాసరావు, టౌన్‌ ప్లానింగ్‌ అధికారి శ్రీలక్ష్మి, వార్డు సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.