Aug 20,2023 00:54

మాట్లాడుతున్న ఉదయశ్రీ

ప్రజాశక్తి -కోటవురట్ల:మండలంలో జగనన్న గృహ నిర్మాణాల పట్ల అధికారులు నిర్లక్ష్యం చేయరాదని మండల ప్రత్యేక అధికారి ఉదయశ్రీ తెలిపారు. శనివారం ఆమె సుంకపూర్‌ను సందర్శించి నిర్మాణాలను పరిశీలించారు. అనంతరం మండల పరిషత్‌ కార్యాలయంలో సిబ్బందితో సమావేశం ఏర్పాటు చేసి సచివాలయ సిబ్బంది ,మండల స్థాయి అధికారులతో ఆమె మాట్లాడుతూ, నిర్మాణాలు వేగవంతం చేయాలని సూచించారు. సచివాలయ సిబ్బంది అందుబాటులో ఉండి సమస్యలను పరిష్కరించాలన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో నిర్మిస్తున్న సచివాలయ, రైతు భరోసా కేంద్రాల వివరాలను అడిగి తెలుసుకున్నారు. జల జీవన మిషన్‌ గ్రామీణ ప్రాంతాల్లో అర్హులందరికీ కుళాయిలు అందజేయాలన్నారు. ఈ కార్యక్రమంలో పరిపాలనా ధికారి చంద్రశేఖర్‌, హౌసింగ్‌ ఇంజనీర్‌ జగదీశ్వరరావు, పిఆర్‌ ఇంజనీరు వర్మ, ఇంజనీర్‌ కరుణ పాల్గొన్నారు.