May 21,2023 00:59
అధికారులతో సమీక్షిస్తున్న సిఇఒ మోహనరావు

ప్రజాశక్తి-భట్టిప్రోలు: జగనన్న లే అవుట్‌లలో గృహ నిర్మాణాలు వేగవంతం చేయాలని జెడ్పి సిఇఓ జె మోహనరావు సూచించారు. భట్టిప్రోలు మండల పరిషత్‌ కార్యాలయంలో శనివారం పంచాయతీ, సచివాలయ కార్యదర్శులు, ఇంజనీరింగ్‌ అసిస్టెంట్‌లు, గృహ నిర్మాణ సిబ్బందితో సమీక్షించారు. గృహాలు నిర్మించుకునే లబ్ధిదారులకు అవసరమైన సౌకర్యాలు కల్పించి పనులు వేగవంతం అయ్యేవిధంగా చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి డివి లలితకుమారి, జెడ్పిటిసి ఉదరు భాస్కరి, ఎంపిడిఓ గుమ్మా చంద్రశేఖర్‌, ఈఓపి ఏడి శేఖర్‌బాబు, హౌసింగ్‌ ఏఇ సౌమ్య తదితరులు పాల్గొన్నారు.