
మేడికొండూరు: పేదలందరికీ ఇళ్ల పథకంలో భాగంగా మేడికొండూరు మండల పరిధిలోని పేరేచర్ల, కైలాసగిరి ప్రాంతంలో నిర్మిస్తున్న గృహాలను కలెక్టర్ ఎం.వేణుగోపాల్ రెడ్డి గురువారం పరిశీలించారు. పేరేచర్ల లోని జగనన్న మూడు లేఅవుట్ లో నిర్మిస్తున్న గృహాలను పరిశీలించిన అనంరం అధికారులతో ఆయన మాట్లాడారు. లేఔట్ లో 188 గృహాలకు సంబంధించి 104 గృహాలు పూర్తి స్థాయిలో నిర్మాణాలు జరిగినట్లు చెప్పారు. అధికారులు పూర్తిస్థాయిలో మౌలిక వసతులు అందించేలా కృషి చేయాలని అన్నారు. ముఖ్యంగా తాగునీరు, విద్యుత్తు, అంతర్గత రహదారుల నిర్మాణాలను పూర్తిస్థాయిలో చేపట్టాలని అధికారులు ఆదేశించారు. ప్రతీ ఇంటికి పిఎం ఆవాస్ యోజన, నవరత్నాలలో పేదలందరికీ ఇళ్లు లోగాలను ఏర్పాటు చేయాలన్నారు కార్యక్రమంలో హౌసింగ్ పిడి వేణుగోపాల్, లేఅవుట్ ప్రత్యేక అధికారి వీరాచారి, హౌసింగ్ ఈఈ శంకర్రావు, తహసిల్దార్ శ్రీనివాస్ శర్మ, హౌసింగ్ ఏఈ దివ్య తదితరులు పాల్గొన్నారు.