Oct 17,2023 20:50

హౌసింగ్‌ ఇంజినీరింగ్‌ అధికారులతో మాట్లాడుతున్న పిఒ కల్పనాకుమారి

ప్రజాశక్తి - సీతంపేట : గృహ నిర్మాణాల్లో పురోగతి పెంచాలని ఐటిడిఎ పిఒ కల్పనకుమారి అన్నారు. మంగళవారం హౌసింగ్‌ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పీవో మాట్లాడుతూ గృహ నిర్మాణ లబ్దిదారులకు అవగాహన కల్పించి పనులను వేగవంతం చేయాలన్నారు. లే అవుట్లలో ఇళ్ల నిర్మాణాలను త్వరితగతిన ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలన్నారు. లే అవుట్లలో ఉన్న సమస్యలు పరిష్కారమయ్యేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. మరుగుదొడ్ల నిర్మాణాలను వేగవంతం చేయాలని అన్నారు. అనంతరం గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం ద్వారా మంజూరైన పనులను పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని పిఆర్‌, ఆర్‌డబ్ల్యుఎస్‌ అధికారులకు సూచించారు. పూర్తయిన పనుల బిల్లులను వెంటనే అప్‌లోడ్‌ చేయాలని సూచించారు. ఇంకా ప్రారంభం కానీ పనులను ప్రారభించేందుకు చర్యలు తీసుకోవాలని అన్నారు. కార్యక్రమంలో హౌసింగ్‌ డిఇ మోహనరావు, ఎఇలు వెంకటేష్‌, పాపారావు, కిరణ్‌, ఆర్‌డబ్ల్యుఎస్‌ డిఇ ఢిల్లీశ్వరారావు, పిఆర్‌ డిఇ లోకనాధం, ఇతర సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
బెలగాం: గహ నిర్మాణాలపై సాలూరు నియోజక వర్గ స్థాయి సమీక్షా సమావేశాన్ని పార్వతీపురం ఐటిడిఎ పిఒ సి.విష్ణుచరణ్‌ చాంబరులో నిర్వహించారు. ఇళ్లు మంజూరై ఇంకా నిర్మాణాలు ప్రారంభించని లబ్దిదారులకు ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకాలపై అవగాహన కల్పించి వెంటనే ప్రారంభించేలా ప్రోత్సహించాలని తెలిపారు. జగనన్న కాలనీల్లో నిర్మాణ పనులు వేగవంతాలనికి అవసరమైన మౌళిక సదుపాయాలు కొరత లేకుండా చూడాలని తెలిపారు. ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాల మేరకు ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేయాలని సూచించారు. ఈ సమావేశంలో హౌసింగు డిప్యూటీ ఇంజనీర్లు, సహాయ ఇంజనీర్లు పాల్గొన్నారు.