Mar 17,2023 00:40
గృహాలను పరిశీలిస్తున్న అధికారులు

ప్రజాశక్తి-భట్టిప్రోలు: మండల కేంద్రం భట్టిప్రోలులో జగనన్న కాలనీలో గృహ నిర్మాణాలను గురువారం డిఆర్డీఏ పిడి, వేమూరు నియోజకవర్గ ప్రత్యేక అధికారి బి అర్జున రావు పరిశీలించారు. ఉగాది నాటికి గృహ నిర్మాణాలు వేగవంతం చేసి పూర్తి చేయా లని లబ్ధిదారులకు సూచించారు. ప్రభు త్వం డ్వాక్రా ద్వారా రూ.35 వేలు అందిస్తుందని వాటితో బేస్మెంట్‌ పూర్తి చేసుకోవచ్చునన్నారు. ముఖ్యంగా లబ్ధిదారులకు అవగాహన కల్పించి గృహ నిర్మాణాల్లో పురోగతి ని సాధించడంలో అధికారులు విఫలం చెందితే బాధ్యులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరిం చారు. ఈ కార్యక్రమంలో ప్రత్యేక అధికారి, పశుసంవర్ధక శాఖ జెడి హనుమంతరావు, ఎంపిడివో చంద్రశేఖర్‌, తహసీల్దార్‌ శ్రావణ్‌ కుమార్‌, హౌసింగ్‌ ఏఈ రావూరి సౌమ్య రేవతి, ఏపిఎం శోభన్‌ తదితరులు ఉన్నారు.