కురబలకోట : రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన గ్రూప్స్ ఫలితాల్లో మిట్స్ విద్యార్థులు ప్రతిభ చాటారని ప్రిన్సిపల్ డాక్టర్ సి.యువరాజ్ పేర్కొన్నారు. సోమవారం గ్రూప్-1లో సత్తాచాటిన పూర్వవిద్యార్థులను సన్మానించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ మాట్లాడుతూ గ్రూప్-1లో రాష్ట్ర స్థాయిలో తమ కళాశాల పూర్వ విద్యార్థులు కె.ప్రవీణ్‌కుమార్‌రెడ్డికు 4వ ర్యాంక్ సాధించి డిప్యూటీ కలెక్టర్‌గా, ఎం.పవిత్ర అసిస్టెంట్ ట్రేజరీ ఆఫీసర్‌గా ఎంపికయ్యారని పేర్కొన్నారు. ప్రవీణ్‌కుమార్‌రెడ్డి మిట్స్‌లో 2009 లో బిటెక్ ఇఇఇ పూర్తి చేసారని, ఎం.పవిత్ర 2018 లో బి.టెక్ ఇసిఇ పూర్తి చేసిందని అన్నారు. తమ కళాశాల విద్యార్థులు ఎంతో పట్టుదలతో చదివి ఉన్నత స్థాయికి ఎదిగిన వీరిని కళాశాల తరుపున సన్మానించడం సంతోషంగా ఉంద న్నారు. విద్యార్థులు తమ తమ లక్ష్యాలను పట్టుదలతో సాధిస్తే ఏది కష్టం కాదని ప్రవీణ్ కుమార్ రెడ్డి అన్నారు. తమ లక్షాన్ని సాధించడానికి మా తల్లిదండ్రులు ప్రోత్సాహం ఎంతో ఉందని పవిత్ర అన్నారు. కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ కమల్‌బాషా, ఇఇఇ విభాగాధిపతి డాక్టర్ పవన్, కలశాల విద్యార్థులు, సిబ్బంది పాల్గొన్నారు.










