Nov 06,2023 21:32

కార్యక్రమంలో మాట్లాడుతున్న జెఎన్‌టియు విసి రంగజనార్ధన

          ప్రజాశక్తి-అనంతపురం    విద్యార్థులు ఒక్కరే కాకుండా గ్రూప్‌ స్టడీస్‌ చేయడం ద్వారా సత్ఫలితాలు సాధిస్తారని జెఎన్‌టియు ఉపకులపతి జి.రంగజనార్ధన సూచించారు. సోమవారం స్థానిక జెఎన్‌టియు ఇంజనీరింగ్‌ కళాశాల ఆడిటోరియంలో ప్రిన్సిపల్‌ ఎస్‌వి.సత్యనారాయణ అధ్యక్షతన ఫ్రెసర్స్‌ డే-2023 కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇక్కడ చదువుతున్న విద్యార్థులు జూనియర్లు, సీనియర్లు అనే తారతమ్యం లేకుండా అందరూ కలిసికట్టుగా చదువుతున్నారన్నారు. విద్యార్థులు వికశించే పుష్పాలు అన్నారు. విద్యార్థి దశలో ఇంజనీరింగ్‌ చదివే సమయం చాలా విలువైందన్నారు. ఈ కార్యక్రమంలో రెక్టార్‌ ఎం.విజయకుమార్‌, రిజిస్ట్రార్‌ సి.శశిధర్‌, బి.దుర్గాప్రసాద్‌, ఇ.కేశవరెడ్డి, పి.సుజాత, పద్మ సువర్ణ, జి.వి.సుబ్బారెడ్డి, ఎ.సురేష్‌బాబు, ఎన్‌.విశాలి, కళాశాల వైస్‌ ప్రిన్సిపల్‌ ఇ.అరుణకాంతి, కోఆర్డినేటర్‌, సెక్రటరీ స్పోర్ట్‌ కౌన్సిల్‌ బి.జోజిరెడ్డి, భువనవిజయ, టి.బాల నరసయ్య, ఎస్‌.చంద్రమోహన్‌రెడ్డి, ఎ.పి.శివకుమార్‌, లలితకుమారి, డి.విష్ణువర్ధన్‌, ఎం.రామశేఖరరెడ్డి, జి.మమత, దిలీప్‌కుమార్‌, డాక్టర్‌ కళ్యాణి రాధా, డాక్టర్‌ మంజుల, అజిత, మాజీ ఆచార్యులు వి.శంకర్‌, బోధన, బోధనేతర సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.
మహిళా టెన్నిస్‌ జట్టుకు అభినందన
అనంతపురం జెఎన్‌టియు నుంచి ఈనెల 8 నుంచి 10వ తేదీ వరకూ జరగనున్న అంతర్‌ విశ్వవిద్యాలయాల మహిళల టేబుల్‌ టెన్నిస్‌ క్రీడలు ఆడేందుకు బెంగళూరు వెళ్తున్న టెన్నిస్‌ మహిళల జట్టును విసి రంగ జనార్ధన, రెక్టార్‌ విజరుకుమార్‌, రిజిస్ట్రార్‌ సి.శశిధర్‌, కళాశాల ప్రిన్సిపల్‌ ఎస్‌వి.సత్యనారాయణ అభినందించారు. ఈ సందర్భంగా విసి మాట్లాడుతూ బెంగళూరు జైన్‌ యూనివర్సిటీలో నిర్వహించనున్న అంతర్‌ విశ్వవిద్యాలయ టెన్నిస్‌ పోటీల్లో జిల్లా మహిళల జట్టు పాలొంటుందన్నారు. వీరికి సుజాత కోచ్‌గా వ్యవహరించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కళాశాల వైస్‌ ప్రినిపల్‌ ఇ.అరుణకాంతి, స్పోర్ట్స్‌ కౌన్సిల్‌ సెక్రటరీ బి.జోజిరెడ్డి పాల్గొన్నారు.