బద్వేలు : రాష్ట్ర ప్రభుత్వం గ్రూప్ - 2 నోటిఫికేషన్ వెంటనే విడుదల చేయాలని, అభ్యర్థుల వయోపరిమితి 47 సంవత్సరాలకు పెంచాలని, భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య డివైఎఫ్‌ఐ కడప జిల్లా అధ్యక్షులు ముడియం చిన్ని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం బద్వేల్ డివైఎఫ్‌ఐ పట్టణ నాయకులతో కలిసి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్-2 పోస్టులు ఎక్కువ సంఖ్యలోనే ఉన్నాయని వాటిని రాష్ట్ర ప్రభుత్వం భర్తీ చేయకుండా కాలయాపన చేయడం సరైంది కాదని వాb ోయారు. నిరుద్యోగ యువతీ యువకుల జీవితాలతో చలగా టమాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.సచివాలయాలలో అనేక ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని వాటికి ఇప్పటివరకు నోటిఫికేషన్ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వలేదని పేర్కొన్నారు. ఖాళీగా ఉన్న పోస్టులన్నీ భర్తీ చేయాలని, జాబ్ క్యాలెండర్ వెంటనే విడుదల చేయాలని తెలిపారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 45 వేల టీచర్ పోస్టులు భర్తీ చేయాలని, లైబ్రరీ సైన్స్ పోస్టులు 6 వేలు, సచివాలయాలలో దాదాపు 8 వేల పోస్టులు ఖాళీగా ఉన్నాయని చెప్పారు. రాష్ట్రంలో 2.43 లక్షల పోస్టులు ఖాళీగా ఉన్నాయని వాటిని వెంటనే రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించాలని వారు గుర్తు చేశారు. నిరుద్యోగ యువతీ యువకులు ఎదురుచూస్తున్న పోస్టులన్నిటికీ రాష్ట్ర ప్రభుత్వం స్పందించి భర్తీ చేసి వెంటనే జాబ్ కేలండర్ విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. లేనిపక్షంలో నిరుద్యోగ నిరుద్యోగ అభ్యర్థులతో కలిసి రాష్ట్రవ్యాప్తంగా డివైఎఫ్‌ఐ యువజన సంఘం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటాలు చేస్తామని వారు హెచ్చరించారు. సమావేశంలో డివైఎఫ్‌ఐ నాయకులు పి సురేంద్ర, లక్ష్మీ నరసయ్య పాల్గొన్నారు.










