Aug 19,2023 00:41

విజేతలను సన్మానిస్తున్న కలెక్టర్‌

ప్రజాశక్తి-పాడేరు: ఐటిడిఏ - 21వ సెంచరీ సాఫ్ట్వేర్‌ సొల్యూషన్స్‌ అందించిన సివిల్స్‌ శిక్షణను గిరిజన అభ్యర్థులు సద్వినియోగం చేసుకుంటున్నారు. గ్రూప్‌ -1, ఎస్‌ఎస్సీ పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధిస్తున్నారు. వివిధ పోటీ పరీక్షల్లో విజేతలుగా నిలుస్తున్నారు. 12 మంది అభ్యర్థులు గ్రూప్‌-1 మెయిన్స్‌కు అర్హత సాధించగా, ఇంటర్వ్యూలకు ముగ్గురు అర్హత సాధించారు. ఆంధ్ర ప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమీషన్‌ నిర్వహించిన ఇంటర్వ్వూలలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన గిరి పుత్రికలలో ఇద్దరు గ్రూప్‌ 1 ఉద్యోగాలు సాధించారు. ఐటిడిఏ 21వ సాఫ్టవేర్‌ సొల్యూషన్స్‌ సంయుక్తంగా అందించిన సివిల్స్‌ కోచింగ్‌ను సద్వినియోగం చేసుకుని ఉత్తమ ర్యాంకులు సాధించిన చిట్టపులి జీవన, జౌడు వెంకట సత్యకీర్తి ఎపిపిఎస్సి విడుదల చేసిన ఫలితాల్లో గ్రూప్‌-1 ఉద్యోగాలు సాధించి విజేతలుగా నిలిచారు. చిట్టపులి జీవన, వెంకట సత్తకీర్తిలను శుక్రవారం ఐటిడి ఏ కార్యాలయంలో జిల్లా కల్టెర్‌ సుమిత్‌ కుమార్‌, జాయింట్‌ కలెక్టర్‌ జె. శివ శ్రీనివాసు, ఐటిడి ఏ.పి.ఓవి. అభిషేక్‌ ఘనంగా సన్మానించారు. 21వ సెంచరీ సాఫ్ట్వేర్‌ సొల్యూషన్స్‌ అధినేత ధరణి అభినందనలు తెలియ జేసారు. ఈ కార్యక్రమంలో గిరిజన సంక్షేమ ఉప సంచాలకులు ఐ.కొండలరావు, ఎబెడబ్ల్యూఓ ఎల్‌.రజని, అభ్యర్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.