Aug 19,2023 20:02

బాల గోవిందు ను సన్మానిస్తున్న దృశ్యం

గ్రూప్‌ 1 విజేతకు సన్మానం
ప్రజాశక్తి - పగిడ్యాల

ఇటీవల వెలువడిన గ్రూప్‌ 1 ఫలితాలలో విజయం సాధించిన పగిడ్యాల గ్రామానికి చెందిన బాల గోవిందును పాఠశాల సిబ్బంది శనివా రం సన్మానించారు. జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు రమణారావు, జూనియర్‌ అసిస్టెంట్‌ తోకల పీతాంబ రెడ్డి మాట్లాడారు. పగిడ్యాల గ్రామానికి చెందిన బాల గోవిందు గ్రూప్‌ 1లో విజయం సాధించి అసిస్టెంట్‌ ఆడిట్‌ అధికారుగా ఎంపికైనందుకు అభినందనీ యమన్నారు. 1వ తరగతి నుండి 10వ తరగతి వరకు పగిడ్యాల జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో విద్యను అభ్యసించారని అన్నారు. నందికొ ట్కూరులో ఇంటర్మీడియట్‌ చదివి అక్కడి నుంచి అంచలంచలుగా ఎదిగి గ్రూప్‌ 1లో విజయం సాధించి అసిస్టెంట్‌ ఆడిట్‌ అధికారిక ఎంపిక కావడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. అనంతరం బాల గోవిందును పూలమాలవేసి దుశాల్వతో సన్మానించారు.