Aug 20,2023 00:48

జీవనను అభినందిస్తున్న నాయకులు

ప్రజాశక్తి-పెదబయలు రూరల్‌:మండల కేంద్రంలో గిరిజన ఉద్యోగులు, జేఏసి అధ్వర్యంలో గిరిజన సంఘ భవనంలో డిఎస్‌పిగా ఎంపికైన సిహెచ్‌. జీవనను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా శనివారం అభినందన సభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గిరిజన ఉద్యోగ సంఘాల జిల్లా నాయకులు ముక్కి శేషాద్రి, ల్లా అధ్యక్షులు ఎం రామకృష్ణ, మాజీ గిరిజన ఉద్యోగుల అద్యక్షులు ఎం సిహెచ్‌. జీవన కు ప్రత్యేక అభినందనలు తెలిపారు, భవిషత్తులో మరిన్ని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఆకాంక్షించారు. మన్యం నుంచి డిఎస్‌పిగా ఎంపిక కావడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో భీముని రాంబాబు, ఎంపిటిసి సభ్యులు కె.బొంజుబాబు, గిరిజన సంఘం నాయకులు. బొండా సన్నిబాబు, స్వామి మాష్టర్‌ ,గంగాధరం, మత్స్య రాజు, నారాయణ పడాల్‌, పి తిరుపతిరావు జె.శ్రీను వాసరావు నాయుడు, తదితరులు పాల్గొన్నారు.