Jun 03,2023 22:55

ప్రజాశక్తి-కాకినాడ ఎపిపిఎస్‌సి గ్రూప్‌-1 మెయిన్స్‌ పరీక్షలు నేటి నుంచి ప్రారంభమైన నేపథ్యంలో శనివారం కాకినాడ జెఎన్‌టియు విశ్వవిద్యాలయం ఇంజనీరింగ్‌ బ్లాక్‌లో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రాన్ని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ కృతికాశుక్లా, ఎఎస్‌పి పి.శ్రీనివాసు, రెవిన్యూ అధికారులతో కలిసి తనిఖీ చేశారు. పరీక్షల నిర్వాహణ, అభ్యర్థులకు కల్పిస్తున్న సౌకర్యాలను కలెక్టరు కతికా శుక్లా ఈ సందర్భంగా పరిశీలించి అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. కలెక్టర్‌ మాట్లాడుతూ జెఎన్‌టియుకెలో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రంలో రెండు బ్లాకుల్లో 460 మంది అభ్యర్థులు ఈ పరీక్షలకు హాజరువుతున్నారని ఆమె తెలిపారు. తొలి రోజు తెలుగు పరీక్షకు సంబంధించి 460 మందికి 365 మంది అభ్యర్థులు హాజరైనట్లు కలెక్టర్‌ తెలిపారు. ఈ పర్యటనలో కలెక్టరు వెంట లైజనింగ్‌ ఆఫీసర్‌ కె.సుబ్బారావు, చీఫ్‌ సూపరింటెండెంట్‌, ప్రిన్సిపల్‌ రత్నకుమారి, ఎపిపిఎస్‌సి అసిస్టెంట్‌ సెక్రటరీ బిఎస్‌ఆర్‌.మూర్తి, ఎఎస్‌ఒ బివివిఎస్‌.శేఖర్‌, అర్బన్‌ తహసీల్దార్‌ సీతాపతిరావు ఉన్నారు.