ప్రజాశక్తి-గుంటూరు : స్థానిక పలకలూరు రోడ్డులోని విజ్ఞాన్ నిరులా మహిళా ఇంజినీరింగ్ కాలేజీలో జరుగుతున్న ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్-1 సర్వీసులకు సంబంధించి పరీక్ష కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ ఎం.వేణుగోపాల్‌రెడ్డి, ఏపీపీఎస్సీ సభ్యులు జి.వి.సుధాకర్‌రెడ్డితో కలసి మంగళవారం పరిశీలించారు. పరీక్ష నిర్వహణ తీరుపై చీఫ్ సూపరింటెండెంట్‌ను అడిగి తెలుసుకున్నారు. పరీక్షలకు 692 మంది అభ్యర్థులు హాజరు కావలసి ఉండగా 533 మంది హాజరయ్యారని, 159 మంది గైర్హాజరయ్యారని వివరించారు. ఈ కేంద్రంలో గ్రూప్-1 పరీక్షలు జూన్ 10 వ తేదీ వరకు జరుగుతున్నందున పరీక్ష రాస్తున్న అభ్యర్థులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా నిర్వహించాలని చీఫ్ సూపరింటెండెంట్ డాక్టర్ పి.రాధికకు సూచించారు. ఏపీపీఎస్సీ నుండి పరీక్ష నిర్వహకులు అసిస్టెంట్ సెక్రటరీ వెంకట లక్ష్మి, సెక్షన్ అధికారులు రమణ, గిరిజ, పరీక్షల సమన్వయ అధికారి, అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ లేబర్ మహబూబ్‌బాషా, గుంటూరు పశ్చిమ మండల తహశీల్దార్ సాంబశివరావు హాజరయ్యారు.










