ప్రజాశక్తి-జగ్గయ్యపేట
పట్టణంలోని 55వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు ఆదివారం ముగిశాయి. ఈ ముగింపు కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ విప్ సామినేని ఉదయభాను పాల్గొన్నారు. పోటీ పరీక్షల కోసం చదువుకునే విద్యార్థులకు 70 లేటెస్ట్ ఎడిషన్ పుస్తకాలను ఉదయభాను అందజేసారు. ఈ సందర్భంగా ఉదయభాను మాట్లాడుతూ విద్యార్థిని, విద్యార్థులుగా మీరు నిత్యం గ్రంథాలయానికి వెళ్తూ విజ్ఞానం పెంచుకోవాలని, ఒక గ్రంథాలయం దగ్గరికి వస్తే నమ్మకమైన మేధోభరితమైన సమాచారం పుస్తకాల్లోనూ పత్రికల్లోనూ లభ్యం అవుతుందని అన్నారు. నేటి యువతరం సెల్ ఫోన్లు, చెడు వ్యసనా లకు అలవాటు పడి జీవితాలను చిన్నాభిన్నం చేసుకుంటున్నారని, బాబా సాహెబ్ అంబేద్కర్ గ్రంథాల యాలలో పుస్తకాలు చదివి ప్రపంచంలోనే గొప్ప మేధావిగా ప్రసిద్ధి పొందాడని అలా అందరూ ఆయన అడుగుజాడల్లో చదువుకొని గొప్పవాళ్లు కావాలన్నారు.ఈ కార్యక్రమంలో కవి, రచయిత, ఉపాధ్యాయులు దోసపాటి నాగేశ్వరరావు, కౌన్సిలర్ వట్టెం మనోహర్, బలుసుపాడు సర్పంచ్ సూర్య ప్రకాష్ పాల్గొన్నారు.










