Oct 01,2023 20:21

రికార్డులను పరిశీలిస్తున్న కార్యదర్శి 

ప్రజాశక్తి-ఉలవపాడు :మండల కేంద్రం మైన ఉలవపాడులో శాఖా గ్రంథాలయాన్ని ఆదివారం ప్రకాశం జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శి ఆదిలక్ష్మి తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె 2022- 23 సంవత్సర వార్షిక రికార్డులను తనిఖీ నిర్వహించారు. గ్రంథా లయ రికార్డులు, పరిసరాలను పరిశీలించారు. ఆమె మాట్లాడుతూ గ్రంథాలయ అభివద్ధికి పలు సూచనలు సలహాలు అందజేశారు. గ్రంథాలయాలు ఎక్కువ శాతం ధరావతు సభ్యులు చేర్చాలన్నారు. విద్యార్థి విద్యార్థులతో చదవటం మాకు ఇష్టం అనే కార్యక్రమాన్ని తప్పకుండా నిర్వహించాలని కోరారు. పంచాయతీల ద్వారా వచ్చే చెస్‌ బకాయిలను వసూలు చేయాలన్నారు. గ్రంథపాలకుడు డి కోటేశ్వరరావు ఉన్నారు.