Aug 23,2023 16:20

ప్రజాశక్తి - భీమడోలు
    భీమడోలు శాఖా గ్రంథాలయంలో గ్రంథ పాలకులు కె.శ్రీనివాసరావు ఆధ్వర్యంలో బుధవారం ఆంధ్ర కేసరి టంగుటూరి ప్రకాశం పంతులు, వాడుక భాషా ఉద్యమ పితామహుడు గిడుగు రామ్మూర్తి జయంతి కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న లయన్స్‌ క్లబ్‌ జిల్లా ప్రతినిధి టివి.ఉమామహేశ్వరరావు, గ్రంథ పాలకులు, ఇతర ప్రముఖులతో కలిసి వారి చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఉమామహేశ్వరరావు, టంగుటూరి ప్రకాశం పంతులు, గిడుగు రామ్మూర్తి జీవిత విశేషాలు, వారు ఆశించిన లక్ష్యసాధనకు చేసిన కృషి వివరించారు. ఈ కార్యక్రమంలో పలువురు విద్యార్థులు, గ్రంథాలయ సందర్శకులు పాల్గొన్నారు.