Dec 26,2022 00:10

మాట్లాడుతున్న గ్రంథాలయాధికారి

ప్రజాశక్తి-నర్సీపట్నంటౌన్‌:స్థానిక శాఖ గ్రంథాలయంలో గ్రంథాలయాధికారి దమయంతి ఆధ్వర్యంలో చిల్డ్రన్స్‌ క్లబ్‌ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పిల్లలను ఉద్దేశించి లైబ్రేరియన్‌ దమయంతి గ్రంథాలయం ప్రాముఖ్యతపై వివరించారు. గ్రంథాలయాల వినియోగంపై పిల్లలకు వివరించారు. పుస్తక పఠనం, వాటి విలువలపై అభిప్రాయాలను తెలియజేశారు. ప్రతి ఆదివారం తప్పక గ్రంథాలయానికి హాజరు అవుతామని పిల్లలు అన్నారు.