Oct 17,2023 21:19

గ్రంథాలయాన్ని ప్రారంభిస్తున్న ప్రకాశరావు

ప్రజాశక్తి - గరుగుబిల్లి :  మండలంలోని తోటపల్లి వద్ద గల కీర్తి శేషులు గరిమెళ్ల నారాయణ స్మారక గ్రంథాలయం మంగళవారం జట్టు ట్రస్ట్‌ తోటపల్లి కార్యాలయంలో ప్రారంభిం చారు. ఈ గ్రంథాయాన్ని తేజో సంస్థ వ్యవస్థాపకులు పిఎస్‌ ప్రకాశరావు ప్రారంభించారు. కార్యక్రమంలో రెడ్‌ క్రాస్‌ చైర్మన్‌ డాక్టర్‌ ఎం.శ్రీరాములు, రచయితలు రౌతు వాసుదేవ రావు, ఎన్‌.బాలకృష్ణ, తుంబలి శివాజీ, డబ్బీరు గోవిందరావు, కిలపర్తి దాలి నాయుడు, బెహరా ఉమామహేశ్వర రావు, గ్రంథాలయ సంఘం జిల్లా అధ్యక్షులు త్రాసుల శివకేశవ రావు, ఎల్‌.వెంకట స్వామి, డాక్టర్‌ ఎం.గోపీనాథ్‌, పెంకి గౌరీశ్వరరావు, సత్యవతి, అన్నపూర్ణ, అల్లువాడ కైలాసరావు తదితరులు పాల్గొన్నారు.