Oct 18,2023 23:36

ప్రజాశక్తి - యడ్లపాడు : మరో గ్రంథాయల ఉద్యమంలో సమాజ భాగస్వామ్యం కోసం నిర్వహిస్తున్న మహాపాదయాత్ర మండల కేంద్రమైన యడ్లపాడుకు బుధవారం చేరింది. యాత్రకు గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా జాషువా కళా కేంద్రం బాధ్యులు ఎన్‌.కాళిదాసు ఆధ్వర్యంలో బాలలు, పెద్దలు స్థానిక వీధుల్లో ప్రదర్శన చేశారు. గ్రంథాల యాలు, విజ్ఞాన కేంద్రాల ఆవశ్యకతపై ప్లకార్డులను ప్రదర్శించారు. పాదయాత్ర బృందం బాధ్యులు వెంకటేశ్వరరెడ్డి మాట్లాడుతూ గ్రంథాలయంలో పుస్తకాలను అందరూ చదివేలా ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు. పాదయాత్ర పల్నాడు జిల్లా ఇన్‌ఛార్జి రామిరెడ్డి మాట్లాడుతూ తెలుగు భాషోత్సవాలు రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించాలన్నారు. కార్యక్రమంలో యడ్లపాడు గ్రంథాలయాధికారి సిహెచ్‌ అంజమ్మ, నారాయణ ఇంగ్లీష్‌ మీడియం పాఠశాల హెచ్‌ఎం సిహెచ్‌ సృజన, సుధాకర్‌రావు, ఎన్‌.విజయలక్ష్మి, పి.సంజీవరావు, ఎం.కృష్ణ, జె.శంకరరావు, శ్రీనివాస్‌ పాల్గొన్నారు.