పుస్తకాలను గ్రంథాలయ అధికారికి అందజేస్తున్న భీమన్న
ప్రజాశక్తి - ఎమ్మిగనూరు రూరల్
గ్రంథాలయ పాఠకుడు భీమన్న కుమార్తె అక్షయ పుట్టినరోజు సందర్భంగా గ్రంథాలయానికి నూతనంగా ప్రచురితమైన రూ.5 వేల విలువ చేసే వివిధ సబ్జెక్టుల పుస్తకాలను ఆదివారం విరాళంగా అందజేశారు. ఈ సందర్భంగా గ్రంథాలయ ఇన్‌ఛార్జీ హరికృష్ణ మాట్లాడారు. ప్రస్తుతం ఉన్న పోటీ ప్రపంచంలో పేద విద్యార్థులు ఖరీదైన పుస్తకాలు కొనుగోలు చేయడం కష్టంగా ఉందని తెలిపారు. విరాళంగా ఇచ్చిన ఈ పుస్తకాలు అనేక ప్రభుత్వ ఉద్యోగాలకు సన్నద్ధమవుతున్న యువతకు ఉపయోగపడతాయని చెప్పారు.










