
వాల్మీకి చిత్రపటానికి నివాళులర్పిస్తున్న సర్పంచ్ గ్రేస్ రత్నకుమారి
ప్రజాశక్తి-దొనకొండ: దొనకొండలో నిర్వహించే గ్రంథాలయానికి విద్యార్థులకు అవసరమైన పుస్తకాలను దొనకొండ సర్పంచ్ గ్రేస్ రత్నకుమారి శనివారం బహూకరించారు. గ్రంథాలయంలో వాల్మీకి జయంతి వేడుకల సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ విద్యార్థులు గ్రంథాలయం ద్వారా విజ్ఞానాన్ని పెంపొందించుకోవాలని, పుస్తకాలను సద్వినియోగం చేసుకొని క్రమశిక్షణతో కష్టపడి చదవటం అలవాటు చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో గ్రంథపాలకులు సుమతి, సహాయకులు నీలిమ, పలువురు గ్రామస్తులు పాల్గొన్నారు.