ప్రజాశక్తి- అద్దంకి : సృజన ఆధ్వర్యంలో అద్దంకి శాఖా గ్రంధాలయానికి రూ.10వేల విలువైన 108 పుస్తకాలు బహూకరించారు. మద్దిపాడుకు చెందిన విశ్రాంత గ్రంథ పాలకులు గంగిశెట్టి నరసింహారావు తాను సేకరించిన వివిధ గ్రంథాలను అద్దంకి గ్రంథ పాలకుడు సుగుణ రావుకు గురు వారం అందజేశారు. ఈ సందర్భంగా గంగిశెట్టి నరసింహారావు మాట్లా డుతూ తెలుగు భాషపై అభిమానం కలిగిన వారికి రాబోయే యువతరానికి ఈ గ్రంథాలు ఎంతోగానో ఉపయోగ పడతాయని ఆయన తెలిపారు. అనంతరం పుస్తకాల దాత నరసింహారావును అభినందించారు. ఈ కార్యక్రమంలో సజన అధ్యక్షుడు గాడేపల్లి దివాకర్ దత్ , కార్యదర్శి కేశవమటం అనిల కుమారసూరి, గ్రామ పెద్దలు ఉబ్బా దేవపాలన, జ్యోతి చంద్రమౌళి, అద్దంకి లెవి ప్రసాద్, షేక్ మహమ్మద్ రఫీ, తాళ్లూరి బాబూరావు, మందా జోసెఫ్, మాచిరాజు వీరరాజు, కూరపాటి రామకోటేశ్వర రావు పాల్గొన్నారు.










