Nov 14,2023 22:55

ఎచ్చెర్ల : ర్యాలీ నిర్వహిస్తున్న చిన్నారులు

పలాస : పుస్తక పఠనంతో విజ్ఞానం పెంపొందించుకోవచ్చని పలాస ఎంపిడిఒ రమేష్‌ నాయుడు, ఎంఇఒ-2 ఎం.సత్యం, పలాస-కాశీబుగ్గ మున్సిపల్‌ కౌన్సిలర్‌ దువ్వాడ శ్రీకాంత్‌ అన్నారు. 56వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల్లో భాగంగా మంగళవారం పలాస శాఖాగ్రంథాలయంలో నిర్వహించిన గ్రంథాలయ వారోత్సవాలలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నెహ్రు జన్మదిన సందర్భంగా వారోత్సవాలు నిర్వహించుకుంటున్నామని అన్నారు. కార్యక్రమంలో గ్రంథాలయ అధికారి రాంబాబు, విద్యార్థులు పాల్గొన్నారు.
నందిగాం : స్థానిక శాఖాగ్రంథాలయంలో నిర్వహించి గ్రంథాలయ వారోత్సవంలో ఎంపిపి ఎన్‌.శ్రీరామ్మూర్తి, గ్రంథాలయాధికారి ఎస్‌.ఉదరు కిరణ్‌, మండల పరిషత్‌ ప్రత్యేక ఆహ్వానితులు చిన్ని జోగారావు యాదవ్‌ పాల్గొన్నారు.
టెక్కలి : స్థానిక గ్రంథాలయంలో నిర్వహించిన గ్రంథాలయ వారోత్సవాన్ని ఎంపిపి అట్ల సరోజనమ్మ ప్రారంభించారు. ముందుగా నెహ్రూ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళ్లర్పించారు. కార్యక్రమంలో గ్రంథాలయాధికారి బి.రూపావతి, సర్పంచ్‌ గొండేల సుజాత, ఎంపిటిసి కూన పార్వతి పాల్గొన్నారు.
పోలాకి: మండల కేంద్రంలోని శాఖాగ్రంథాలయం నిర్వహించిన గ్రంథాలయ వారోత్సవాలను సర్పంచ్‌ మజ్జి రవణమ్మ ప్రారంభించారు. కార్యక్రమంలో గ్రంథాలయాధికారి కె.మానస, ఎంపిటిసి ప్రతినిధి తూలుగు అశోక్‌కుమార్‌, వైసిపి మండల యివజన విభాగం అధ్యక్షుడు ఆర్‌.త్రినాథరావు, మాజీ సర్పంచ్‌ ఎల్‌.రాంబాబు, బిడిఒ పివిఎస్‌ఎన్‌ మూర్తి పాల్గొన్నారు.
ఇచ్ఛాపురం : స్థానిక గ్రంథాలయంలో గ్రంథాలయ వారోత్సవాలను డిటి హరిబాబు ప్రారంభించారు. గ్రంథాలయంలో సాహిత్యం, సైన్స్‌, గణితం, పోటీ పరీక్షల పుస్తకాలు అందుబాటులో ఉన్నాయని, వాటిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో గ్రంథాలయాధికారి పూర్ణచంద్ర బెహరా, ప్రభుత్వ స్కూల్‌ పీడీ గణేష్‌, శారద, లత పాల్గొన్నారు.
కోటబొమ్మాళి: మండల కేంద్రంలో గ్రంథాలయానికి శాశ్వతత భవనానికి కృషి చేస్తానని స్థానిక సర్పంచ్‌ కాళ్ల సంజీవరావు అన్నారు. ఈ మేరకు గ్రంథాలయ వారోత్సవాలను ప్రారంభించారు. ముందుగా నెహ్రు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళ్లర్పించారు. కార్యక్రమంలో వైసిపి నాయకులు బుజ్జి, ఇర్రి చిరంజీవి, అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు.
కాకినాడ ఆదిత్య మహిళా డిగ్రీ కళాశాలలో...
శ్రీకాకుళం: నగరంలోని కాకినాడ ఆదిత్య మహిళా డిగ్రీ కళాశాలలో జాతీయ గ్రంథాలయ వారోత్సవాలను కళాశాల డైరెక్టర్‌ బిఎస్‌ చక్రవర్తి, ప్రిన్సిపాల్‌ కె.శివశంకర్‌ ప్రారంభించారు. తొలుత ఎస్‌ఆర్‌ రంగనాథన్‌, మాజీ ప్రధాని పండిట్‌ జవహర్‌ లాల్‌ నెహ్రూ చిత్రపటాలకు పూల మాలవేసి ఘనంగా నివాళ్లు అర్పించారు. వారోత్సవాల్లో భాగంగా చిత్రలేఖనం, వక్తృత్వం, బుక్స్‌ మీద ట్రెజర్‌ హంట్‌, పుస్తక ప్రదర్శన, క్విజ్‌ వంటి పోటీలను నిర్వహిస్తున్నామని, ఇంటర్మీడియట్‌ స్థాయి విద్యార్థులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో కళాశాల ఎన్‌ఎస్‌ఎస్‌ పిఒ మజ్జి శ్రీనివాసరావు, కంప్యూటర్‌ విభాగాధిపతి ప్రసాదరావు, లైబ్రేరియన్‌ పి.వై.కమల్‌ కుమార్‌ పాల్గొన్నారు.
బలగ : బలగ శాఖాగ్రంథాలయంలో గ్రంథాలయ అధికారి పి.ఉగ్రసేన్‌ గ్రంథాలయ వారోత్సవాలను ప్రారంభించారు. కార్యక్రమంలో విశ్రాంత జాయింట్‌ డైరెక్టర్‌ ఆఫ్‌ అగ్రికల్చర్‌ కూన వేణుగోపాలరావు, మానవ హక్కుల రాష్ట్ర ఉపాధ్యక్షులు ఉరిట్టి శ్రీనివాసరావు, రాష్ట్ర ఉపాధ్యక్షులు కె.వేణుగోపాలరావు, మాజీ కౌన్సిలర్‌ ఆబోతు రామ్మోహనరావు, జీవశాస్త్రం అధ్యాపకులు పున్నారావు, సహాయకలు కె.అనిత పాల్గొన్నారు.
లావేరు: స్థానిక శాఖా గ్రంథాలయములో 56వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలను మండల విద్యాశాఖాధికారి మురళీకృష్ణ ప్రారంభించారు. బాలల దినోత్సవం సందర్భంగా నెహ్రూ చిత్రపటానికి ఆయన పూలమాలలు వేసి నివాళ్లర్పించారు. జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల నుండి శాఖా గ్రంథాలయం వరకు విద్యార్థులతో ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో గ్రంథాలయాధికారి మురపాక శ్రీనివాసరావు, హైస్కూల్‌ ఇన్‌ఛార్జి ప్రధానోపాధ్యాయులు మీసాల శ్రీనివాసరావు, గ్రంథాలయ సహాయకులు గడ్డియ్య, ఉపాధ్యాయులు లక్ష్మణరావు, భగవాన్‌, రమేష్‌ పాల్గొన్నారు.
ఎచ్చెర్ల: మండలం ధర్మవరం శాఖాగ్రంథాలయం ఆధ్వర్యంలో గ్రంథాలయ వారోత్సవాలు ప్రారంభించారు. గ్రామ సర్పంచ్‌ అల్లు కన్నబాబు నెహ్రూ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళ్లర్పించారు. కార్యక్రమంలో ఎంపిటిసి బగ్గు రాజారావు, హెచ్‌ఎం హరికృష్ణ, ఉపాధ్యాయులు రఘునాధరావు, యువ నాయకుడు రుప్ప రమేష్‌, అసిరితల్లి యువజన సంఘ సభ్యులు రుప్ప లక్ష్మీనాయుడు, అరసవిల్లి వెంకటరమణ, కునుకు వాసు, చల్ల అప్పలసూరి, కరస్పాండెంట్‌ ఎం.జయరాం, గ్రంథాలయాధికారి మల్లిపెద్ది చంద్రశేఖర్‌, బి. సూర్యనారాయణ, యువజన సంఘ సభ్యులు జగదీష్‌, సురేష్‌, ప్రకాష్‌, మధు, మహేష్‌, పొన్నాడ సూరిబాబు, కుప్పిలి సూర్యనారాయణ, విద్యార్థులు పాల్గొన్నారు.
రణస్థలం రూరల్‌: మండలంలోని కొండ ములగాం ప్రభుత్వ ఆదర్శ పాఠశాలలో నెహ్రు జన్మదినం బాలల దినోత్సవం ఘనంగా నిర్వహించారు. పాఠశాలలో గల ఆదర్శ గ్రంథాలయంలో బాలలకు వివిధ పోటీలు పెట్టారు. ఉపాధ్యాయులు జోత్స్న నిర్వహణలో నాటికను 6 తరగతి విద్యార్థినులు బి.లక్ష్మి ప్రసన్న, ఎం.వినోషిని, పి.మేఘన, ప్రియ, కె. వాసివి, వై.చైత్ర నటించారు. అలాగే ప్రభుత్వ ఆదర్శ పాఠశాలలో ఇన్‌ఛార్జి ప్రిన్సిపాల్‌ పి. కృష్ణ ఆధ్వర్యంలో బాలలను ఉత్తేజ పరచడానికి బ్రెడ్స్‌ ఆర్గనైజేషన్‌ మండల ఆర్గనైజరు తేజ, జెఆర్‌పురం-2 మహిళా పోలీస్‌ నాగమణి బాల్యవివాహాలు అరికట్టడంలో విద్యార్థులు పాల్గొనాలని ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
పొందూరు: స్థానిక శాఖా గ్రంథాలయంలో గ్రంథాలయ వారోత్సవాలు గ్రంథాలయాధికారి సిహెచ్‌ వెంకటేష్‌ ఆధ్వర్యంలో ఘనంగా ప్రారంభించారు. సర్పంచ్‌ రేగడి లక్ష్మి, ఎంఇఒ-2 పట్నాన రాజారావులు జ్యోతి ప్రజ్వలన చేశారు. కార్యక్రమంలో యంగ్‌స్టార్‌ యూత్‌ అసోసియేషన్‌ సీనియర్‌ సభ్యులు కాళ్లకూరి శాంతారాం, సంఘ సేవకులు రాజు, ప్రముఖ రచయిత జి.ప్రభాకర్‌, ఒడిసి నిర్వాహకులు పాల్గొన్నారు.
సరుబుజ్జిలి: స్థానిక గ్రంథాలయంలో పండిత్‌ జవహర్‌ లాల్‌ నెహ్రూ జయంతి, బాలల దినోత్సవం వేడుకలతో పాటు గ్రంథాలయ వారోత్సవాలను ఘనంగా నిర్వహించారు. స్థానిక నందికొండ ప్రాథమిక పాఠశాల విద్యార్థి విద్యార్థినిలు, ఉపాధ్యాయులు పాల్గొని నెహ్రూ చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళ్లర్పించారు. అలాగే రొట్టవలస, సరుబుజ్జిలి జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలతో పాటు కేరళ ఇంగ్లీష్‌ మీడియం స్కూల్‌, శ్రీ వెంకట సాయి విద్యాసంస్థల ఆధ్వర్యంలో బాలల దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయాధికారి బగాది రమణమూర్తి ఉన్నారు.
జి. సిగడాం: స్థానిక శాఖ గ్రంథాలయంలో గ్రంథాలయ వారోత్సవాలు ఘనంగా నిర్వహించారు. గ్రంథాలయాధికారి సిహెచ్‌ వెంకటేష్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో సర్పంచ్‌ ప్రతినిధి ముద్దాడ గౌరిశ్వరరావు, విఅర్‌ఒ బి.నర్సింగరావు, విఅర్‌ఎ వినోద్‌, కెజిబివి పాఠశాల ఉపాధ్యాయులు లక్ష్మి, శ్రీలక్ష్మి, గ్రంథాలయ సిబ్బంది ఎన్‌. దుర్గారావు, పాఠకులు, విద్యార్థులు పాల్గొన్నారు.
మెళియాపుట్టి: స్థానికశాఖా గ్రంథాలయంలో గ్రంథాలయ వారోత్సవాలు ప్రారంభమయ్యాయి. గ్రంథాలయంలో నెహ్రూ చిత్రపటానికి మాజీ ఎంపిపి మాడుగుల రామారావు గ్రంథాలయ అధికారి అనురాధ ఆధ్వర్యంలో పూలమాలలు వేసి నివాళ్లర్పించారు.