ప్రజాశక్తి-యంత్రాంగం గ్రంథాలయాలతో మానసిక వికాసం సాధ్యమని పలువురు అన్నారు. బుధవారం పలుచోట్ల గ్రంథాలయ వారోత్సవాలు నిర్వహించారు. కాకినాడ రూరల్ రమణయ్యపేట ఎపిఐఐసి కాలనీలో అడబాల ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో విశ్రాంత అధికారి చింతపల్లి సుబ్బారావు మాట్లాడారు. అనంతరం పుస్తకాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో నిమ్మకాయల వెంకటేశ్వరరావు, గల్లా సుబ్బారావు, పార్థసారథి, రాజా, సత్యనారాయణ పాల్గొన్నారు. పెద్దాపురం శాఖాగ్రంథాలయంలో రెండో రోజు ఏర్పాటు చేసిన పుస్తక ప్రదర్శనను మున్సిపల్ వైస్ చైర్మన్ నెక్కంటి సాయి ప్రసాద్ ప్రారంభించారు. అనంతరం గ్రంధాలయాధికారి పాలంకి నాగరాజు అధ్యక్షతన జరిగిన సభలో ఆయన మాట్లాడారు. ఎంఇఒలు ప్రభాకర్ శర్మ, చౌదరి, మున్సిపల్ కౌన్సిలర్లు తాటికొండ వెంకటలక్ష్మి, విడదాసరి రాజా, ఆరెళ్ల వీరరాఘవ, వాసంశెట్టి గంగ, షేక్ రఫీ ,గ్రంథాలయ సిబ్బంది పాల్గొన్నారు. గండేపల్లి సూరంపాలెం ఆదిత్య విద్యా ప్రాంగణంలోని డిగ్రీ, పీజీ కళాశా గ్రంథాలయ విభాగం ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా బిజినెస్ మేనేజ్మెంట్ ప్రిన్సిపల్స్ డాక్టర్ సంజరు కుమార్, గ్రంథాలయోద్యమ రూపకర్త అయ్యంకి వెంకట రమణయ్య, ఎస్.ఆర్.రంగనాధన్ చిత్రపటాలకు పూలమాలలు వేసి పుష్పాంజలి ఘటించారు. 14వ తేదీ నుంచి 20 వరకు విద్యార్థులకు గ్రంథాలయాలపై వక్తత్వం, వ్యాసరచన, క్విజ్ పోటీలు, పుస్తక ప్రదర్శన నిర్వహించనున్నట్టు తెలిపారు. ఏలేశ్వరం మంచి పుస్తకం పఠనం ద్వారా మంచి స్నేహితుని కంటే ఎక్కువని సీనియర్ పాఠకుడు ఉడతల రమణారావు అన్నారు. స్థానిక గ్రంథాలయంలో విద్యార్థులకు పుస్తక పఠనం ఆవశ్యకతను వివరించారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ పాలకుడు కవికొండల సత్యనారాయణ ఉన్నారు. సామర్లకోట రూరల్ బచ్చు ఫౌండేషన్ హైస్కూల్ హెచ్‌ఎం తోటకూర సాయి రామకృష్ణ శాఖా గ్రంథాలయంలో పుస్తక ప్రదర్శనను ప్రారంభించారు. వెంకటేష్, యార్లగడ్డ రాజేష్, ప్రసాద్ పాల్గొన్నారు. పిఠాపురం పుస్తక ప్రదర్శన నిర్వహించారు. ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు జి.శ్రీనివాస్, వి.సత్యప్రియపుస్తకాల ప్రాధాన్యత, చదవడం ద్వారా ఉపయోగాలు వివరించారు.