గ్రంథాలయ ఛైర్‌పర్సన్ మధుబాల
ప్రజాశక్తి- చిత్తూరు అర్బన్
గ్రంథాలయాలను సద్వినియోగం చేసుకోవడం వల్ల విజ్ఞానాన్ని పెంచుకోవచ్చని గ్రంథాలయ చైర్‌పర్సన్ మధుబాల తెలిపారు. గ్రంథాలయ 56వ వార్షికోత్సవాలను పురస్కరించుకొని ప్రజాశక్తి ప్రత్యేక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా ఉన్న గ్రంథాలయాలను పాఠకుల అభివద్ధికి అనుగుణంగా ఆధునీకరించి అందుబాటులోకి తీసుకొచ్చామన్నారు. ఆటకుల అభివద్ధికి తగ్గట్టుగా డిజిటల్ లైబ్రరీ, కంప్యూటర్ శిక్షణ అందిస్తున్నట్లు తెలిపారు.
ప్రజాశక్తి: గ్రంథాలయ వారోత్సవాలను పురస్కరించుకొని ఎలాంటి కార్యక్రమాలను చేపట్టారు?
చైర్‌పర్సన్: ఈనెల 14 నుండి 20వ తేదీ వరకు జిల్లా వ్యాప్తంగా ఉన్న గ్రంథాలయాల్లో వారోత్సవాలను నిర్వహించడం జరిగింది. వారోత్సవాలను పురస్కరించుకొని రోజుకో కార్యక్రమాన్ని నిర్వహించాలని పిలుపునిచ్చాం. 20వ తేదీ సోమవారం వారోత్సవాల ముగింపు కార్యక్రమాలు అన్ని జిల్లా గ్రంథాలయాల్లో నిర్వహిస్తున్నాము.
ప్రజాశక్తి: గ్రంథాలయ వారోత్సవాలు ఎలా జరిగాయి?
చైర్‌పర్సన్: ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఈనెల 14 నుండి 20వ తేదీ వరకు నిర్వహించిన గ్రంథాలయ వారోత్సవాలు విజయవంతమయ్యాయి. గ్రంథాలయ ప్రాధాన్యతను సామాజిక స్పహ విద్య ప్రాధాన్యత చాటి చెప్పేలా గ్రంథాలయ వారోత్సవాలు నిర్వహించాలని భావించాము. ఈ మేరకు విద్యార్థుల్లో సజనాత్మకత వెలికి తీసేందుకు రక్తత్వ వ్యాసరచన చిత్రలేఖన మ్యూజికల్ చైర్స్ పోటీలు నిర్వహించడం జరిగింది. అలాగే గ్రంధాలయ సమస్త ఏర్పాటుకు సహకరించిన వారికి రచయితలు కమాకవులకు సన్మానాలు చేయడం జరిగింది మహిళా దినోత్సవం నిర్వహించి మహిళల యొక్క ప్రాధాన్యత తెలియజేశాము.
ప్రజాశక్తి: గ్రంథాలయ అభివద్ధికి ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు?
చైర్‌పర్సన్: రాష్ట్ర ప్రభుత్వం గ్రంథాలయాల అభివద్ధికి పూర్తి సహకారం అందిస్తోంది. ఈ మేరకు గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని గ్రంథాలయాలను ఆధునీకరిస్తున్నాము. ప్రతి గ్రంథాలయంలో పాఠకులకు అవసరమైన నూతన పుస్తకాలను ఏర్పాటు చేయడంతో పాటు, అన్ని రకాల దినపత్రికలను అందుబాటులో ఉంచుతున్నాం. శిథిలావస్థకు చేరిన గ్రంథాలయాల స్థానంలో నూతన భవనాలు నిర్మించేందుకు ప్రతిపాదనలు పంపడం జరిగింది.
ప్రజాశక్తి: నేటి విద్యార్థులు యువతకు గ్రంథాలయ చైర్పర్సన్‌గా ఏమి చెప్పదలుచుకున్నారు?
ఛైర్‌పర్సన్: విద్యార్థులు, యువత స్థానికంగా ఉన్న గ్రంథాలయాలను సద్వినియోగం చేసుకోవడం ద్వారా విజ్ఞానాన్ని పెంచుకోవడంతో పాటు పోటీ పరీక్షలకు ఉపయోగపడతాయి. పోటీ పరీక్షలకు అవసరమైన పుస్తకాలను కూడా గ్రంథాలయాల్లో అందుబాటులో ఉంచాము. సమయం దొరికినప్పుడల్లా ఎక్కువసేపు గ్రంధాలయాల్లో గడపడం ఎంతో ఉపయోగకరం ఈ విషయాన్ని విద్యార్థులు యువకులు గుర్తించాలి.