May 16,2023 23:58

తాళ్లపాలెంలో బహుమతులు చూపుతున్న విద్యార్థులు

ప్రజాశక్తి- కశింకోట
మండలంలోని తాళ్ళపాలెం శాఖ గ్రంధాలయంలో వేసవి విజ్ఞాన శిబిరంలో భాగంగా మంగళవారం కథల చెప్పడం, పాటలు, లెమన్‌ స్పూన్‌ గేమ్స్‌ వంటివి ఆడించారు. ఏ.ప్రవీణ్‌ ప్రజ్ఞాన్‌, ఎస్‌.పావని లక్ష్మి, ఎం.వైష్ణవి, కె.భవ్య, కె.లావణ్య, పి.జోష్ణ ప్రియా విజేతలుగా నిలిచారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు బి.సురేష్‌ కుమార్‌, గ్రంథాలయ అధికారి కె.జగన్‌ పాల్గొన్నారు.
అచ్యుతాపురం : అచ్చుతాపురం శాఖ గ్రంథాలయంలో 9వ రోజు శిబిరంలో తెలుగు, ఆంగ్లం భాషలపై లెక్చలర్‌ శివకృష్ణ బోధించారు. తెలుగులో అచ్చులు హల్లులుతో కూడికున్న పదాలను వివరించారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ అధికారి దొడ్డి కోటేశ్వరరావు, 30 మంది విద్యార్థులు పాల్గొన్నారు.
గొలుగొండ : స్థానిక శాఖ గ్రంథాలయంలో వేసవి విజ్ఞాన శిబిరం గ్రంథాలయాధికారి రాజబాబు ఆధ్వర్యంలో విద్యార్థులకు పుస్తక పఠనం, కథలు చెప్పించడం, వ్యాసరచన, చిత్రలేఖన పోటీలు నిర్వహించారు. కార్యక్రమంలో సిఆర్‌పి రామకృష్ణ, విశ్రాంత ఉపాధ్యాయులు సుబ్బారావు పాల్గొన్నారు.
నక్కపల్లి : మండలంలో చినదొడ్డిగల్లు శాఖాగ్రంధాలయంలో వేసవి విజ్ఞాన శిబిరంలో భాగంగా గ్రంధాలయాధికారి కె.జనార్దన్‌ ఆధ్వర్యంలో మంగళవారం విద్యార్థులకు దేశభక్తి గీతాల ఆలాపన పోటీలను నిర్వహించారు. ఈ పోటీల్లో విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. కార్యక్రమంలో
గ్రంధాలయ అభివృద్ధి కమిటీ చైర్మన్‌ అప్పలరాజు, సిబ్బంది రవణమ్మ పాల్గొన్నారు.
కోటవురట్ల : చిన్నారులు పుస్తకాలు చదవడం అలవాటు చేసుకోవాలని వేసవి విజ్ఞాన శిబిరం కార్యక్రమంలో శాఖ గ్రంథాలయ అధికారి కోరారు. విద్యార్థులకు పుస్తక పఠనంపై అవగాహన కలిగించి, పుస్తకాలిచ్చి చదివించారు.
ములగాడ : ఆట పాటలతో ఉల్లాసం, ఉత్సాహం ఉంటుందని, జీవితం పట్ల అనురక్తి పెరుగుతుందని ప్రముఖ న్యాయవాది జికెవి.రాజు అన్నారు. మల్కాపురంలోని శాఖా గ్రంథాలయంలో నిర్వహిస్తున్న వేసవి శిక్షణా శిబిరంలో ఆయన మంగళవారం మాట్లాడారు. కార్యక్రమంలో జాతీయ సేవా పథకం జిల్లా ప్రోగ్రామ్‌ అధికారి ఇపిఎస్‌.భాగ్యలక్ష్మి, సీనియర్‌ ప్రోగ్రామ్‌ అధికారి వై.అనసూయాదేవి, రచయిత కె.సత్తిరాజు, కార్మిక నాయకులు బి.సత్యానందం, గ్రంథాలయాధికారి వి.అజరుకుమార్‌, రిసోర్స్‌ పర్సన్‌ లావణ్య మాట్లాడారు. అనంతరం బాలలకు కాగితాలు, చెక్కలతో వివిధ కళాకృతులను తయారుచేసే వర్క్‌ షాప్‌ నిర్వహించారు. శిబిరాన్ని స్థానిక యువకులు బాల, సిద్ధార్థ సమన్వయపరిచారు.