55వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలను పురస్కరించుకొని జిల్లాలోని పలు గ్రంథాలయాల్లో మంగళవారం పుస్తక ప్రదర్శనలు నిర్వహించారు. వీటికి పాఠకుల నుంచి విశేష స్పందన లభించింది.
ప్రజాశక్తి - చోడవరం
స్థానిక శాఖా గ్రంథాలయంలో నిర్వహించిన పుస్తక ప్రదర్శనకు వివిధ పాఠశాలలు విద్యార్థులు, పాఠకులు విచ్చేసి పుస్తకాలను తిలకించారు. ఈ సందర్భంగా గ్రంథాలయ అధికారి జి.తిరుమల కుమారి మాట్లాడుతూ పుస్తక పఠనం అనేది చాలా మంచి అలవాటు అని, పుస్తకాలు చదివి అత్యున్నత స్థానాలకు ఎదగాలని విద్యార్థులకు సూచించారు. పోటీ పరీక్షలకు కావలసిన అన్ని రకాల పుస్తకాలు తమ గ్రంథాలయంలో అందుబాటులో ఉన్నాయని చెప్పారు.
కె.కోటపాడు : స్థానిక శాఖ గ్రంథాలయం వద్ద మంగళవారం పుస్తక ప్రదర్శన కార్యక్రమాన్ని విశ్రాంతి ఉపాధ్యాయులు బి.శ్రీనివాసరావు ప్రారంభించారు. దేశ నాయకుల జీవిత చరిత్రలు, బాల సాహిత్యం, వివిధ పోటీ పరీక్షలకు ఉపయోగపడే పుస్తకాలను ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, పాఠకులు పాల్గొన్నారు.
కశింకోట : మండలంలోని తాళ్ళపాలెం శాఖా గ్రంథాలయంలో ఏర్పాటు చేసిన పుస్తక ప్రదర్శనలో జీవిత చరిత్రలు, పిల్లల కథలు, పోటీ పరీక్షలకు సంబంధించిన పుస్తకాలు ఉంచారు. ఈ సందర్భంగా పాఠశాల విద్యార్థులకు సీనియర్స్ జూనియర్స్ విభాగాల్లో క్విజ్ పోటీలను నిర్వహించారు. ఇందులో 112 మంది విద్యార్థులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో వైసిపి నాయకులు ఇందలి ముసలినాయుడు, గ్రంథపాలకులు జి.మురళీకృష్ణ, చిన్ని భాస్కర్, ఉపాధ్యాయులు ప్రశాంతి, లోవలక్ష్మి, ఝాన్సీ, నాయుడు, తాళ్లపాలెం, కశింకోట గ్రంథాలయాల అధికారులు కె.జగన్, ఎస్.వరలక్ష్మి, విద్యార్థులు పాల్గొన్నారు.
బుచ్చయ్యపేట : స్థానిక శాఖ గ్రంథాలయంలో నిర్వహించిన పుస్తక ప్రదర్శనను పాఠశాల విద్యార్థులు సందర్శించారు. ఈ సందర్భంగా గ్రంథాలయ అధికారి వి.కృష్ణారావు మాట్లాడుతూ పుస్తక పఠనం ద్వారా విజ్ఞానాన్ని పెంపొందించుకోవచ్చని చెప్పారు. విద్యార్థులు గ్రంథాలయాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
సబ్బవరం : స్థానిక గ్రంథాలయంలో గ్రంథాలయాధికారి పివి.రమణ ఆధ్వర్యంలో జరిగిన పుస్తక ప్రదర్శనలో ధరావత్తులు సేకరణ కార్యక్రమాన్ని సబ్బవరం గ్రామ సర్పంచ్ డి.ప్రసాదరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు పుస్తక పఠనం అలవర్చుకోవలన్నారు. ఈ కార్యక్రమంలో వై.రము, రామకృష్ణ, రామప్రసాదు, విద్యార్థులు పాల్గొన్నారు.
అచ్యుతాపురం : గ్రంథాలయాల్లో పుస్తకాలు చదవడం ద్వారా విజ్ఞానం పెరుగుతుందని డివైఎఫ్‌ఐ జిల్లా సహాయ కార్యదర్శి కె.సోమునాయుడు అన్నారు. జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు సందర్భంగా మంగళవారం అచ్యుతాపురం గ్రంథాలయంలో పుస్తక ప్రదర్శన కార్యక్రమం గ్రంథాలయ అధికారి దొడ్డి కోటేశ్వరావు ఆధ్వర్యాన ఏర్పాటు చేశారు. పుస్తక ప్రదర్శనను సందర్శించిన సోమునాయుడు మాట్లాడుతూ పుస్తక పఠనంతో గ్రామస్థాయి నుంచి ప్రపంచ స్థాయి వరకు వచ్చే మార్పులు, గత చరిత్ర, రాబోయే కాలంలో జరిగే పరిణామాలు వంటి వాటిని తెలుసుకోవచ్చని చెప్పారు. ఈ కార్యక్రమంలో వైభవ రాజ్ నరేంద్ర మోహన్, సంతోష్ రేణుక, మేస్త్రి భవాని, మీనాక్షి తదితరులు పాల్గొన్నారు.
నక్కపల్లి : గ్రంథాలయ వారోత్సవాల్లో భాగంగా చినదొడ్డిగల్లు శాఖా గ్రంథాలయంలో లైబ్రేరియన్ జనార్దన్ ఆధ్వర్యంలో పుస్తక ప్రదర్శన నిర్వహించారు. .జనరల్ నాలెడ్జ్, నీతి కథలు, మహనీయుల జీవితచరిత్రలు, పోటీపరీక్షలు తదితర పుస్తకాలను అందుబాటులో ఉంచారు. పలువురు పాఠకులు, విద్యార్థులు పుస్తక పఠన చేశారు. కార్యక్రమంలో పీడీ కమల, గ్రంథాలయ చైర్మన్ అప్పలరాజు, గట్టెం నానాజీ, రమణమ్మ పాల్గొన్నారు. నక్కపల్లి గ్రంథాలయంలో గ్రంథాలయ అధికారి గోవిందేశ్వరరావు ఆధ్వర్యంలో పుస్తక ప్రదర్శన నిర్వహించారు..ప్లాస్టిక్ నివారణపై విద్యార్థులకు అవగాహన కల్పించారు డిగ్రీ కళాశాల అధ్యాపకులు నాగేశ్వరరావు పాల్గొన్నారు.
చీడికాడ: జాతీయ గ్రంథాలయ వారోత్సవాలలో భాగంగా బుధవారం చీడికాడ శాఖా గ్రంథాలయంలో పుస్తక ప్రదర్శన నిర్వహించారు. దేశ నాయకుల జీవిత చరిత్రలు, బాలల సాహిత్యం, ఆంధ్రప్రదేశ్ చరిత్రతోపాటు పోటీ పరీక్షల పుస్తకాలను ప్రదర్శనలో ఉంచారు. కార్యక్రమంలోలైబ్రేరియన్ ఎంఎస్‌ఎల్ జోగేశ్వరి, వివిధ పాఠశాలల విద్యార్థులు పాల్గొన్నారు.
కోటవురట్ల :గ్రంథాలయ వారోత్సవాల్లో భాగంగా మంగళవారం స్థానిక శాఖా గ్రంథాలయంలో స్థానిక ఉన్నత పాఠశాల, కస్తూర్బా విద్యార్థులకు లాల్‌బహదూర్‌శాస్త్రి జీవితచరిత్రపై వ్యాసరచన పోటీలు నిర్వహించారు.అలాగే పుస్తక ప్రదర్శన ఏర్పాటు చేసినట్లు లైబ్రేరియన్ అప్పలనాయుడు తెలిపారు.










