ప్రజాశక్తి- శ్రీకాకుళం: గ్రంథాలయ వారోత్సవాల్లో భాగంగా మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శి కుమార్ రాజు, డిప్యూటీ లైబ్రేరియన్ వివిజిఎస్ శంకరరావు, అసిస్టెంట్ లైబ్రేరియన్ ఎస్‌వి రమణమూర్తి, గ్రంథాలయ సిబ్బంది మురళీ కృష్ణమూర్తి, భానుమతి, రామ్మోహన్, ప్రత్యూష, కళ్యాణి, వరలక్ష్మి, శివ గణేష్, సరోజిని, తెలుగు ఉపాధ్యాయులు రామదాసు, ఉపాధ్యాయులు ఉషా, సోడవరపు ఈశ్వరరావు, విద్యార్థులు పాల్గొన్నారు.
లావేరు: గ్రంథాలయ వారోత్సవాలు సందర్భంగా స్థానిక శాఖా గ్రంథాలయంలో ఆదివారం శ్రీకాకుళం పట్టణానికి చెందిన మలిపెద్ది దేవేంద్ర ప్రసాద్ చేసిన మ్యూజిక్ షో విద్యార్థులను ఆకట్టుకుంది. కాగితాలను రూపాయి నోట్లుగా మార్చడం, రుమాలను పువ్వులుగా మార్చడం ద్వారా పిల్లలను ఆకట్టుకున్నారు. మహిళా దినోత్సవం సందర్భంగా ఇందిరా గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళ్లర్పించారు. కార్యక్రమంలో గ్రంథాలయాధికారి మురపాక శ్రీనివాసరావు, గాంధీ మహిళా సంఘం అధ్యక్షురాలు ఎం.వెంకటరమణమ్మ, గ్రంథాలయ సహాయకులు జి.గడ్డియ్య, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
పోలాకి: స్థానిక శాఖా గ్రంథాలయంలో విశ్రాంత గ్రంథాల యాధికారి బుచ్చి సుబ్రహ్మణ్యంను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో సర్పంచ్ మజ్జి రమణమ్మ, సర్పంచ్ ప్రతినిధి మజ్జి లక్ష్మీ నారాయణ, ఎంపిటిసి ప్రతినిధి తూలుగు అశోక్ కుమార్, మాజీ సర్పంచ్ ఎల్.రాంబాబు, ఈసర్ల చిన్ని, హరికృష్ణ, గ్రంథాల యాధికారి కె.మానస, లుకలాపు తాత, టి.శ్రీనివాసరావు, అర్జున్ పాల్గొన్నారు.
ఎచ్చెర్ల: ధర్మవరం శాఖా గ్రంథాలయ ఆధ్వర్యంలో మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. కార్యక్రమాలకు సమతా మిదిలా విద్యాలయం ప్రిన్సిపాల్ ముద్దాడ ఇందుమతి పాల్గొన్నారు. తొలుత ఇందిరాగాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళ్లర్పించారు. కార్యక్రమంలో గ్రంథాలయాధికారి మలిపెద్ది చంద్రశేఖర్, సహాయకులు సూర్యనారాయణ, జగదీష్, పొన్నాడ సూరిబాబు, ప్రకాష్, సిమ్మ సూర్యనారాయణ మాస్టారు, బాన్న వెంకటరావు, విద్యార్థులు, పాల్గొన్నారు.
నందిగాం: స్థానిక శాఖా గ్రంథాలయంలో వారోత్సవాలు సందర్భంగా గ్రంథాలయాధికారి ఎస్. ఉదరు కిరణ్, ఎంపిటిసి ప్రతినిధి అంబొడి విష్ణు ఆధ్వర్యంలో ఇందిరాగాంధీ జన్మదినోత్సవం సందర్భంగా చిత్రపటానికి పూలమాలవేసి నివాళ్లర్పించారు. కార్యక్రమంలో రాములమ్మ, విద్యార్థులు పాల్గొన్నారు.
పొందూరు : స్థానిక శాఖా గ్రంథాలయంలో వారోత్సవాల్లో భాగంగా ఇందిరా గాంధీ జయంతిని పురస్కరించుకొని గ్రంథాల యాధికారి సిహెచ్ వెంకటేష్ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు నిర్వహించారు. గ్రంథాలయ పాఠకులు పాల్గొన్నారు.
మెళియాపుట్టి: స్థానిక శాఖా గ్రంథాలయంలో వారోత్సవాల సందర్భంగా దిశాచట్టంపై అవగాహన కార్యక్రమం నిర్వ హించారు. అలాగే ఇందిరాగాంధీ జయంతి, మహిళా దినోత్సవం ఆవశ్యకతపై తెలియజేశారు. ఈ సందర్భంగా ముగ్గుల పోటీలు నిర్వహించారు. కార్యక్రమంలో మండల పంచాయతీ విస్తరణ అధికారి తారకేశ్వరి, గ్రంథాలయాధికారి ఆర్ అనురాధ, నీలిమ, శ్వేత, భారతి, మనోజ్, విద్యార్థులు పాల్గొన్నారు.
నౌపడ: స్థానిక శాఖా గ్రంథాలయంలో వారోత్సవాలను గ్రంథాల యాధికారిని బి.రూపవతి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఇందిరాగాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళ్లర్పించారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి ఎం.రవి, హెచ్‌ఎం అప్పలరాజు, బాలరాజు, జ్యోతి పాల్గొన్నారు.
ఇచ్ఛాపురం: స్థానిక శాఖా గ్రంథాలయంలో వారోత్సవాల్లో భాగంగా ఇందిరాగాంధీ జయంతిని పురష్కరించుకొని మహిళా దినోత్సవం నిర్వహించారు. విద్యార్థినులకు రంగవల్లి పోటీలు నిర్వహించారు. కార్యక్రమంలో స్వర్ణభారతి హైస్కూల్ ప్రిన్సిపాల్ ఆశ గౌరిశంకర్‌రెడ్డి, గ్రంథాలయాధికారి పూర్ణ పాల్గొన్నారు.
పలాస: కాశీబుగ్గ గ్రంథాలయంలో ఇందిరాగాంధీ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ముందుగా ఇందిరాగాంధీ చిత్రపటానికి నివాళ్లర్పించారు. కార్యక్రమంలో మున్సిపల్ కో-ఆప్షన్ సభ్యులు సంతోష్‌కుమార్, గ్రంథాలయాధికారి రాం బాబు పాల్గొన్నారు.
టెక్కలి: స్థానిక గ్రంథాలయంలో తహశీల్దార్ కురమాన ప్రవల్లిక ప్రియ ఇందిరాగాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళ్లర్పించారు. వారోత్సవాల్లో భాగంగా విద్యార్థులకు రంగవళ్లుల పోటీలు నిర్వహించారు. కార్యక్రమంలో గ్రంథా లయాధికారిణి బి.రూపావతి, విశ్రాంత గ్రంథాల యాధికారి గున్న ప్రసాదరావు, సహయకురాలు ఎస్. అమ్మనమ్మ, పాఠకులు, విద్యార్థులు పాల్గొన్నారు.