ప్రజాశక్తి-చందర్లపాడు: మండల కేంద్రమైన చందర్లపాడులోని స్థానిక శాఖ గ్రంధాలయంలో రెండో రోజు గ్రంథాలయ అధికారి ఎస్.కె మస్తాన్ వలి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో పిఈటి శ్రీనివాసరావు పాల్గొని టెన్త్ క్లాస్ విద్యార్థులకు క్విజ్, ఆటల పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కిషోర్ తదితరులు పాల్గొన్నారు. ప్రజాశక్తి-తిరువూరు: జాతీయ గ్రంధాలయ వారోత్సవాలు సందర్భంగా తిరువూరు గ్రంథాలయంలో మంగళవారం ఏర్పాటుచేసిన పుస్తక ప్రదర్శనను మండల విద్యాశాఖాధి కారి సోమశేఖర్ నాయక్ ప్రారంభించారు. అంతకుముందు సబ్ జూనియర్స్‌కు మ్యూజికల్ చైర్స్, ఆటలు పోటీలు నిర్వహించారు. అనంతరం జిల్లా పరిషత్ బాలికోన్నత పాఠశాల ఉపాధ్యాయురాలు భారతి మాదకద్రవ్యాల ప్రమాదంపై పాఠకులకు, విద్యార్థులకు అవగాహన కల్పించారు. ప్రజాశక్తి-గంపలగూడెం: గ్రంథాలయ వారోత్సవాల్లో భాగంగా ఆయా గ్రంథాలయాల్లో పుస్తక పఠనం నిర్వహించినట్లు పెనుగోలను, గంపలగూడెం గ్రంథాలయ శాఖల ఇన్చార్జులు జ్యోతిర్మయి, సుంకర వెంకటేశ్వరరావు తెలిపారు.










